ROADS: గుంతల రహదారులు
ABN , Publish Date - Aug 20 , 2025 | 11:49 PM
తమ గ్రామాలకు వెళ్లే రహదారుల్లో ప్రయాణం చేయాలంటే నరకప్రాయంగా ఉందని మండలం లోని పలు గ్రామప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని మ ల్లాకాల్వ, దర్శినమల, ఓబుళనాయునిపల్లి, నేలకోట, ఏలుకుంట్ల తదితర గ్రామాల నుంచి ధర్మవరానికి వెళ్లే రహదారి చాలా ఆధ్వానంగా తయా రైంది.
ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, ప్రయాణికులు
పలు ప్రమాద సంఘటనలు
ధర్మవరం రూరల్, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): తమ గ్రామాలకు వెళ్లే రహదారుల్లో ప్రయాణం చేయాలంటే నరకప్రాయంగా ఉందని మండలం లోని పలు గ్రామప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని మ ల్లాకాల్వ, దర్శినమల, ఓబుళనాయునిపల్లి, నేలకోట, ఏలుకుంట్ల తదితర గ్రామాల నుంచి ధర్మవరానికి వెళ్లే రహదారి చాలా ఆధ్వానంగా తయా రైంది. గుంతలు ఏర్పడి, కంకరతేలి ప్రయాణానికి కష్టతరంగా మారింది. ఈ గ్రామాల నుంచి ప్రతి రోజు ధర్మవరానికి ఆటోల్లో, ద్విచక్రవాహనాలు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈ రహదారిలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాని తెలిపారు. అదేవిధంగా గొట్లూరు నుంచి సుబ్బరావుపేటకు వెళ్లే రోడ్డంతా దెబ్బతి గుంతలు ఏర్పడ్డాయి. ప్రధానంగా ఓబుళనాయునిపల్లి కొండ, సుబ్బరావు పేట గ్రామాల నుంచి మట్టిని అక్రమంగా భారీ వాహనాల్లో తరలిస్తుండటంతో రోడ్లున్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయా గ్రామస్థులు పేర్కొంటున్నారు. మట్టిని తోలేటప్పుడు కూడా వాహనాలు వేగంగా వస్తున్నాయని దీంతో మట్టి అంతా రోడ్లుపై పడిఉండటంతో ఆ రహదారు ల్లో జారిపడి ప్రమాదాలకు గురవుతున్నామని వాహనదారులు తెలుపుతు న్నారు. పోలీసు, అధికారులు స్పందించి వాహనాల వేగాన్ని నియంత్రించి, రహదారులను బాగుచేయాలని ఆయా గ్రామస్థులు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....