ROADS: రోడ్లపై మడుగులు
ABN , Publish Date - Aug 18 , 2025 | 12:03 AM
మండలంలోని బడన్న పల్లికి వెళ్లాలంటే ఇప్పటికీ మట్టి రోడ్డే గతి. పైగా ఆ రోడ్డులో గుంతలు ఏర్ప డ్డాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఆ గుంతల్లో వర్షపునీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ధర్మవరానికి వెళ్లే రహదారి క్రాస్ నుంచి రైల్వే బ్రిడ్జి కింద వరకు కిలోమీటర్ మేర మట్టిరోడ్డు గుంతలమయం అయింది. దీంతో ప్ర స్తుతం కురుస్తున్న వర్షాలతో నీరంతా ఆ గుంతల్లో నిలిచి మడుగును తలపిస్తోంది. అలాగే రోడ్డుంతా బురదమయం అయింది.
ధర్మవరం రూరల్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బడన్న పల్లికి వెళ్లాలంటే ఇప్పటికీ మట్టి రోడ్డే గతి. పైగా ఆ రోడ్డులో గుంతలు ఏర్ప డ్డాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఆ గుంతల్లో వర్షపునీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ధర్మవరానికి వెళ్లే రహదారి క్రాస్ నుంచి రైల్వే బ్రిడ్జి కింద వరకు కిలోమీటర్ మేర మట్టిరోడ్డు గుంతలమయం అయింది. దీంతో ప్ర స్తుతం కురుస్తున్న వర్షాలతో నీరంతా ఆ గుంతల్లో నిలిచి మడుగును తలపిస్తోంది. అలాగే రోడ్డుంతా బురదమయం అయింది. దీంతో వాహన దారులు ఆ రహదారిలో వెళ్లాలంటే హాడలెత్తిపోతున్నారు. ఎక్కడ జారి పడతామోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు వస్తే ఆ రహదారిలో వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆ గ్రామస్థులు తెలుపుతున్నారు. అధికా రులు స్పందించి రహదారిని బాగుచేయాలని వారు కోరుతున్నారు.
నల్లమాడ: మండలంలోని చౌటకుంటపల్లిలో మలకవేమల - ఓడీసీ ప్రధాన రహదారిలో ఇళ్లకు ఇరువైపుల మురుగునీరు నిలువ ఉంది. అబ్బా ఈ మురుగుతో ఎన్ని అగచాల్లో అని ప్రజలు వాపోతున్నారు. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షం నీరు ముందుకు వెళ్లడానికి వీలులేక రోడ్డుపై నిలిచిపో యింది. దీంతో ఆ రోడ్డుపై వెళ్లే వాహన దారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. వాహనాలు వెళ్లే సమయంలో సమీపంలోని ఇళ్లలోకి మురుగునీరు పడుతున్నట్టు స్థానికులు ఆవేదన చెందుతున్నారు. వారం రోజులుగా నీరు ని ల్వ ఉండడంతో దోమలు వృద్ధిచెంది విషజ్వరాలు ప్ర బలే అవకాశమున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....