POLICE: మహిళా భద్రతపై పోలీసుల చర్యలు
ABN , Publish Date - Oct 26 , 2025 | 11:42 PM
మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, నేరాలను పూర్తిగా అరికట్టే దిశగా జిల్లా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎస్పీ సతీష్‌కు మార్ ఆదేశాలతో ఆదివారం జిల్లా వ్యాప్తంగా నేరస్థులను, రౌడీషీటర్లను పోలీసుస్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ ఓ ప్రకటనలో తెలియచేస్తూ... మహిళలు, విద్యార్థినుల పట్ట అసభ్యకర ప్రవర్తనను మానుకోవాలన్నారు. లేకుంటే కఠిన చర్యలు తప్పవని హె చ్చరించారు.
పుట్టపర్తి రూరల్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, నేరాలను పూర్తిగా అరికట్టే దిశగా జిల్లా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎస్పీ సతీష్‌కు మార్ ఆదేశాలతో ఆదివారం జిల్లా వ్యాప్తంగా నేరస్థులను, రౌడీషీటర్లను పోలీసుస్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ ఓ ప్రకటనలో తెలియచేస్తూ... మహిళలు, విద్యార్థినుల పట్ట అసభ్యకర ప్రవర్తనను మానుకోవాలన్నారు. లేకుంటే కఠిన చర్యలు తప్పవని హె చ్చరించారు. నేరస్థుల్లో సానుకూల మార్పులు రావాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదేసమయంలో మహిళల భద్రత, సామాజిక శాంతి భద్రతల పరిర క్షణలో భాగంగా పో లీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తెలిపారు. ఆ మేరకు పోలీసు అధికారులు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
బత్తలపల్లి: మండలపరిధిలోని రామాపురం గ్రామంలో ఆదివారం రాత్రి వారధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు, మహిళల పట్ల అఘాయిత్యాలు, రోడ్డు ప్రమాదాలు, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల అనర్థాలు, సైబర్ నేరాలపై డీఎస్పీ హేమంత కుమార్ ఎల్‌ఈడీ డిస్‌ప్లే ద్వారా అవగాహన కల్పించారు. సీఐ ప్రభాకర్, ఎస్‌ఐ సోమశేఖర్ పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....