PLANTS: ఎండిపోతున్న మొక్కలు
ABN , Publish Date - Dec 21 , 2025 | 11:47 PM
ప్రభుత్వం పచ్చదనాన్ని పెంపొదించాలన్న సంకల్పంతో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల లు, కళాశాలల ప్రాంగణాల్లో మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టిం ది. అయితే కొత్తచెరువు మండల కేంద్రంలోని మేజర్ పంచాయతీ అధికారులు రెండు నెలల క్రితం బుక్కపట్నం ఫారెస్టు నర్సరీ నుంచి దాదాపు 500 మొక్కలను నాటేందుకు తీసుకొచ్చారు.
కొత్తచెరువు, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం పచ్చదనాన్ని పెంపొదించాలన్న సంకల్పంతో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల లు, కళాశాలల ప్రాంగణాల్లో మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టిం ది. అయితే కొత్తచెరువు మండల కేంద్రంలోని మేజర్ పంచాయతీ అధికారులు రెండు నెలల క్రితం బుక్కపట్నం ఫారెస్టు నర్సరీ నుంచి దాదాపు 500 మొక్కలను నాటేందుకు తీసుకొచ్చారు. అయితే వాటిని పంచాయతీలో నాటక పోగా, వాటికి నీరు కూడా పో యకపోవడంతో అవి చనిపోతున్నాయి. దీంతో పంచాయతీ కార్యాల యానికి వచ్చిన ప్రజలు ఈ మొక్కలను నాటరా? అని చర్చించుకుం టున్నారు. ఆ మొక్కలను పంచాయతీ కార్యాలయంలో కానీ, గ్రామ సచివాలయాల వద్ద కానీ నాటి ఉంటే ఈ రోజు చనిపోయి ఉండేవి కావని పట్టణవాసులు వాపోతున్నారు.