MATCH: క్రీడలతో శారీరక దృఢత్వం : డీఎస్పీ
ABN , Publish Date - Aug 21 , 2025 | 12:01 AM
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక దృఢత్వాన్ని కలిగిస్తాయని డీఎస్పీ హేమంతకుమార్ పేర్కొ న్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ జన్మ దినం సందర్భంగా బుధవారం ఆర్డీటీ స్థానిక క్రీడామైదానంలో అ టల్ బిహారీ వాజ్‌పేయి స్మారక సీజన-2 క్రికెట్ టోర్నీని ప్రారంభిం చారు.
వాజ్‌పేయి స్మారక క్రికెట్ టోర్నీ ప్రారంభం
ధర్మవరం, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి):క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక దృఢత్వాన్ని కలిగిస్తాయని డీఎస్పీ హేమంతకుమార్ పేర్కొ న్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ జన్మ దినం సందర్భంగా బుధవారం ఆర్డీటీ స్థానిక క్రీడామైదానంలో అ టల్ బిహారీ వాజ్‌పేయి స్మారక సీజన-2 క్రికెట్ టోర్నీని ప్రారంభిం చారు. ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథులుగా డీఎస్పీ హేమంత కుమార్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్‌కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్, నియోజకవర్గ ఇనచార్జ్ హరీశబాబు, ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సాయికృష్ణ హాజరయ్యారు. మొదటి మ్యాచను డీ ఎస్పీ టాస్ వేసి ప్రారంభించారు. మొదటిమ్యాచలో పోతుకుంట బూ ్లకాప్స్, చత్రపతిజట్లు తలపడగా రెండు పరుగుల తేడాతో బ్లూ కాప్స్ జట్టు గెలిచింది. రెండోమ్యాచను బీజేపీ సీనియర్ నాయకులు శ్యాంకుమార్ ప్రారంభించారు. సేవ్ ఫార్మర్స్ జట్టు గణిలెవెన్స జట్టు పై 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాకే ఓబుళేశు, రూరల్ అధ్యక్షుడు గొట్లూరుచంద్ర, ఆర్డీటీ ఏటీఎల్ శ్రీనివాసులు, కోచలు రాజశేఖర్, పృథ్వీ, అనిల్, అంబటిసతీశ, బిల్లేశ్రీనివాసులు, పోతుకుం ట రాజు, గంగాధర్, చిన్నలింగమయ్య, అంజి తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....