Share News

MINISTER: క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం

ABN , Publish Date - Aug 18 , 2025 | 12:11 AM

క్రీడలు శారీరక, మానసిక దృఢత్వాన్ని కల్గిస్తాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ధర్మవరంలోని ఎన్డీఏ కార్యాలయం లో మంత్రి ఆదివారం పలు సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. ముందుగా త్వరలో ప్రారంభం కానున్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి క్రికెట్‌ టోర్నీ సీజన-2 టీషర్టులను ఆయన ఆవిష్కరించారు.

MINISTER: క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం
Minister Sathya Kumar unveiling the t-shirts

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌

ధర్మవరం, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): క్రీడలు శారీరక, మానసిక దృఢత్వాన్ని కల్గిస్తాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ధర్మవరంలోని ఎన్డీఏ కార్యాలయం లో మంత్రి ఆదివారం పలు సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. ముందుగా త్వరలో ప్రారంభం కానున్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి క్రికెట్‌ టోర్నీ సీజన-2 టీషర్టులను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...క్రీడలు ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమన్నారు. యువత చురుకుగా క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని పిలుపు నిచ్చారు. పట్టణంలో క్రీడల అభి వృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోందని భరోసా ఇచ్చా రు. అటల్‌ బిహారీ వాజ్‌పేయి క్రికెట్‌ టోర్నీని గత ఏడాది విజయ వంతంగా నిర్వహించినట్టు మంత్రి గుర్తుచేశారు. అదే విధంగా రెండో సీజనను మరింత విస్తృతస్థాయిలో ఎక్కువమంది యువత పాల్గొనేలా, క్రీడాస్ఫూర్తిని పెంపొదించేలా నిర్వహించాలన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ: మంత్రి సత్యకుమార్‌ ఆదివా రం నియోజకవర్గంలోని 31మందికి రూ.15,13,747 విలువైన చె క్కులను పంపిణీచేశారు. ఎన్టీఆర్‌ వైద్యసేవల ద్వారా వైద్య సహా యం అందుతుందన్నారు. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడి సహాయం అందించడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింప డమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్‌, మార్కెట్‌యార్డ్‌ చైర్‌పర్సన అంబటి అరుణశ్రీ, క్రికెట్‌ కోచ రాజశేఖర్‌ పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Aug 18 , 2025 | 12:11 AM