VILLAGERS: గంజివారిపల్లి పంచాయతీ ఏర్పాటుకు వినతి
ABN , Publish Date - Oct 02 , 2025 | 12:06 AM
మండలంలోని వేపమానిపేట గ్రామ పంచాయతీని విభజించి గంజివారిపల్లి కేంద్రంగా కొత్త గ్రామపంచాయితీని ఏర్పాటు చేయాలని ఆ గ్రామస్థులు ఎంపీడీఓ నసీమాకు బుధవారం వినతిపత్రం అందజేశారు. గంజివారిపల్లి, కొత్తపూలవాండ్లపల్లి, ఎస్సీ కాలనీలు, బోయపల్లి, గుర్రంగుండ్లపల్లి తదితర గ్రామాల ప్రజలు గ్రామపంచాయతీ కేంద్రమైన వేప మానిపేటకు అధికారిక పనుల నిమిత్తమై రావాలంటే పలు ఇ బ్బందులు ఎదుర్కోవాల్సి ఉందన్నారు.
కదిరి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): మండలంలోని వేపమానిపేట గ్రామ పంచాయతీని విభజించి గంజివారిపల్లి కేంద్రంగా కొత్త గ్రామపంచాయితీని ఏర్పాటు చేయాలని ఆ గ్రామస్థులు ఎంపీడీఓ నసీమాకు బుధవారం వినతిపత్రం అందజేశారు. గంజివారిపల్లి, కొత్తపూలవాండ్లపల్లి, ఎస్సీ కాలనీలు, బోయపల్లి, గుర్రంగుండ్లపల్లి తదితర గ్రామాల ప్రజలు గ్రామపంచాయతీ కేంద్రమైన వేప మానిపేటకు అధికారిక పనుల నిమిత్తమై రావాలంటే పలు ఇ బ్బందులు ఎదుర్కోవాల్సి ఉందన్నారు. కొత్త పూలవాండ్లపల్లి నుం చి పంచాయతీ కేంద్రానికి రానుపోను సుమారు 28 కిలోమీటర్ల ఉందన్నారు. డైరెక్ట్‌గా బస్సు సౌకర్యం లేదన్నారు. దీంతో ఇటీవల ఓటింగ్ శాతం గణనీయంగా పడిపోయిందన్నారు. కావున పూల వాండ్లపల్లి, ఎస్సీ కాలనీ, గుర్రం గుండ్లపల్లిని కలిపి గంజివారిపల్లి కేంద్రంగా కొత్త గ్రామపంచాయతీ ఏర్పాటు చేయాలని దాదాపు 400 మంది గ్రామస్థులు సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ఎం పీడీఓకు అందజేశారు. గ్రామస్థులు అక్బర్, బాబు, శీనా, ముస్తఫా, వెంకటేష్, ఫకృద్దీన, రాజీష్, బాదుల్లా తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....