TDP: మీకు ప్రజలే బుద్ధి చెబుతారు
ABN , Publish Date - Dec 10 , 2025 | 12:03 AM
కూటమి ప్రభుత్వంపై అవా కులు, చవాకులు పేలితే ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారని వైసీపీ ఇనచార్జ్ మగ్బూల్ బాషాపై టీడీపీ నాయకులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. తెలుగుయువత మండలాధ్యక్షుడు కావడి ప్రవీణ్‌కుమార్, నా యకులు షేక్ మహబూబ్‌బాషా, పులికంటి నరసింహులు తదితరులు మంగళవారం మండలకేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.
వైసీపీ కదిరి ఇనచార్జ్‌పై టీడీపీ నాయకుల ఆగ్రహం
తనకల్లు, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంపై అవా కులు, చవాకులు పేలితే ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారని వైసీపీ ఇనచార్జ్ మగ్బూల్ బాషాపై టీడీపీ నాయకులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. తెలుగుయువత మండలాధ్యక్షుడు కావడి ప్రవీణ్‌కుమార్, నా యకులు షేక్ మహబూబ్‌బాషా, పులికంటి నరసింహులు తదితరులు మంగళవారం మండలకేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి ఈవిఎంల ట్యాపరింగే అని ఎన్నికల కమిషనను తప్పుదోవ పట్టిస్తున్నట్లుగా వైసీపీ కదిరి ఇనచార్జ్ మగ్బూల్‌బాషా మాట్లాడడం సరికదన్నారు. వైసీపీ అధికారం కొల్పోయాక... ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపై విషం చిమ్ము తోందన్నారు. ప్రజా సమస్యలపై నిత్యం పరితపించే నాయకుడు కంది కుంట వెంకటప్రసాద్‌పై అసత్య ఆరోపణలు మానుకోవాలన్నారు. సీబీఐ నుంచి క్లీనచిట్ పొందిన మా నాయకుడు కందికుంటను విమర్శిస్తే ప్ర జలే బుద్ధి చెబుతారన్నారు. జగన చిన్నాన్న వివేకానందరెడ్డిని చంప డానికి కదిరి నుంచి గొడ్డలని కొనుగోలు చేశారని మా ఎమ్మెల్యే ఎక్కడా అనలేదని, ఆ విషయాన్ని సీబీఐ నిర్ధారించిందని గుర్తు చేశారు. రాష్ట్రం లో సూపర్ సిక్స్ అమలు చేయడంలేదని మగ్బూల్ బాషా అనడం, ఆయన అమాయకత్వానికి నిదర్శనమన్నారు. వైసీపీ వా ళ్ల మాటలను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మీనాయకుడు, మీ ఎమ్మెల్యేలు అ సెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని హితవు పలికారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....