MLA : సుపరిపాలనతో రాష్ట్ర ప్రజలు సురక్షితం
ABN , Publish Date - Jul 03 , 2025 | 12:17 AM
రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారం చేపట్టినప్పటినుంచి సుపరిపానలతో ప్రజలు సురక్షితంగా ఉన్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సుపరిపాలనకు తొలిఅడుగు - ఇంటింటికి టీడీపీ కార్య క్రమాన్ని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ బుధవారం రూరల్ పరిధిలోని కుమ్మరవాండ్ల పల్లిలో ప్రారంభించారు. అలాగే ఆయన నంబులపూలకుంట మండలంలో ని కమ్మగుట్టపల్లి, గౌకనపేటలో సుపరిపాలనకు తొలిఅడుగు కార్యక్రమం లో పాల్గొన్నారు.

- ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్
కదిరి అర్బన/నంబులపూలకుంట, జూలై 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారం చేపట్టినప్పటినుంచి సుపరిపానలతో ప్రజలు సురక్షితంగా ఉన్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సుపరిపాలనకు తొలిఅడుగు - ఇంటింటికి టీడీపీ కార్య క్రమాన్ని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ బుధవారం రూరల్ పరిధిలోని కుమ్మరవాండ్ల పల్లిలో ప్రారంభించారు. అలాగే ఆయన నంబులపూలకుంట మండలంలో ని కమ్మగుట్టపల్లి, గౌకనపేటలో సుపరిపాలనకు తొలిఅడుగు కార్యక్రమం లో పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. ఆయన ఇంటింటికి వెళ్లి యేడాది పాలనలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, చేపట్ట బోయే పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. గ్రామాల్లో నెలకొన్న పలు సమస్యలపై ప్రజలు ఎమ్మెల్యేకి పలు వినతులు వచ్చాయి. కుమ్మరవాండ్లపల్లి కార్యక్ర మంలో తహసీల్దార్ మురళీక్రిష్ణ, ఎంపీడీఓ పోలప్ప, ఆయాశాఖల అధికా రులు, సిబ్బంది, నాయకులు చెన్నకేశవులు, గంగులప్ప, హరి, భార్గవ్, శ్రీనివాసులు, ప్రేమలత, రమణ, సుధాకర్ తదితరులు పా ల్గొన్నారు. అలాగే కమ్మగుట్టపల్లి, గౌకనపేటలో టీడీపీ మండల కన్వీ నర్ చంద్రశేఖర్‌నాయుడు, క్లస్టర్ ఇనచార్జ్ దండే రవి, నాయకులు హను మంతరెడ్డి, రెడ్డెప్ప, నరసింహులు, నాగేంద్ర, పౌల్‌రెడ్డి, శ్రీరాములనాయుడు, విజయ్‌కుమార్ యాదవ్, ఆంజనప్పనాయుడు, రఘునాథ్‌రెడ్డి, తహసీల్దార్ దేవేంద్రనాయక్, ఎంపీడీఓ పార్థసారఽథి, ఏఓ లోకేశ్వర్‌రెడ్డి, హెచఓ ప్రతాప్ రెడ్డి, ట్రాన్సకో ఏఈ సాలేహాబాషా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పుట్టినప్పటి నుంచి మంచం మీదే
కదిరి: ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పర్యటిస్తున్న సందర్భం గా పుట్టినప్పటినుంచి మంచం మీదే ఉన్న కుమార్‌యాదవ్ ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులను పలకరించారు. తండ్రి లక్ష్మణ్ మాట్లాడుతూ పుట్టి నప్పటినుంచి మంచంమీదే ఉన్నాడని, ఇప్పటికి వయస్సు 23 సంవత్స రాలని తెలిపాడు. ప్రభుత్వం రూ.6వేల పింఛన ఇస్తోందని, రూ.15 వేలు ఇప్పించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే చర్యలు తీసుకుంటామన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....