DOGS: కుక్కల బెడదతో జనం బెంబేలు
ABN , Publish Date - Oct 12 , 2025 | 11:37 PM
మండల కేంద్రమైన నల్లమాడలో కుక్కుల బెడదతో జనం బెంబేలెత్తిపోతున్నారు. బస్టాండ్ నుంచి నల్లమాడ క్రాస్ వరకు ఉన్న ప్రధాన రహదారిలో దాదాపు 30 నుంచి 40 కుక్కలు స్వైర విహారం చేస్తూ ఉంటాయి. ఈ ప్రధాన రహదారిలో పాదచారులు, ద్విచక్రవాహనదారులు, ఆటోలు తరుచూ పోతూ వ స్తుంటాయి.
నల్లమాడ, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రమైన నల్లమాడలో కుక్కుల బెడదతో జనం బెంబేలెత్తిపోతున్నారు. బస్టాండ్ నుంచి నల్లమాడ క్రాస్ వరకు ఉన్న ప్రధాన రహదారిలో దాదాపు 30 నుంచి 40 కుక్కలు స్వైర విహారం చేస్తూ ఉంటాయి. ఈ ప్రధాన రహదారిలో పాదచారులు, ద్విచక్రవాహనదారులు, ఆటోలు తరుచూ పోతూ వ స్తుంటాయి. ద్విచక్రవాహనాలకు అడ్డం వచ్చి ఎంతో మంది జారిపడి కాళ్లు, చేతులు విరగ్గొట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. రాత్రిపూట నడుచుకుంటూ వెళ్లాలంటే కుక్కలు ఎక్కడ దాడి చేస్తాయో అని జనం భయపడిపోతు న్నారు. అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....