DHARNA: అర్హత ఉన్నా పింఛన్లు తొలగించారు
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:32 AM
ఎన్నోఏళ్లుగా పింఛన్లు పొందుతున్నామని, అన్ని అర్హతలు ఉన్న తమకు ప్రస్తుత వెరిఫికేషనలో నిలిపి వేశారని పలువురు దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమకు పింఛ న్లు పునరుద్ధరించాలని కోరారు. ఈ మేర కు వారు మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఫించన్లు రాకుంటే తాము ఇబ్బం దులు పడాల్సి వస్తుందని వాపోయారు.
దివ్యాంగుల నిరసన
ధర్మవరం రూరల్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ఎన్నోఏళ్లుగా పింఛన్లు పొందుతున్నామని, అన్ని అర్హతలు ఉన్న తమకు ప్రస్తుత వెరిఫికేషనలో నిలిపి వేశారని పలువురు దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమకు పింఛ న్లు పునరుద్ధరించాలని కోరారు. ఈ మేర కు వారు మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఫించన్లు రాకుంటే తాము ఇబ్బం దులు పడాల్సి వస్తుందని వాపోయారు. అనంతరం ఎంపీడీఓ సాయి మనోహర్‌ను కలిశారు. ఆయన మాట్లాడుతూ అర్హులైన ఎవరి పింఛన్లు నిలిచిపోవవని, రీవెరిఫి కేషనకు స్థానిక సచివాలయంలో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆర్డీఓకు వినతి
ధర్మవరం: వెరిఫికేషన పేరుతో తొలగించిన అర్హులైన దివ్యాంగులకు పింఛన కొనసాగించాలని సీఐటీయూ నాయకులు మంగళవారం ఆర్డీఓ మహేశ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా సీఐటీయూ మండల కన్వీనర్ జేవీ రమణ మాట్లాడుతూ.... వెంటనే అర్హులైన వారి పింఛన్లను పున రుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్డీఓను కలిసిన వారి లో ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లానాయకులు ఎస్‌హెచబాషా, కౌలు రైతు సంఘం జిల్లా ప్రధా న కార్యదర్శి బత్తల కదిరప్ప, సీఐటీయూ నాయకులు ఎల్ ఆదినారాయణ, చేనేత నాయకు లు వెంకటస్వామి ఉన్నారు.
రాస్తారోకో
బత్తలపల్లి : వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మండలంలో అర్హులైన ప లువురు దివ్యాంగుల పింఛన్లు తొలగించారని సీపీఐ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు మండల కేంద్రంలోని నాలుగు రోడ్ల కూడలిలో మంగళవారం దివ్యాంగులతో కలసి సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వ హించారు. వెరిఫికేషన చేసిన వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మండలవ్యాప్తం గా 512 మంది అర్హులైన దివ్యాంగులు పింఛన్లు కోల్పోతున్నారని అవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు వారితో మాట్లాడి అక్కడి నుంచి పంపివేశారు. సీపీఐ నాయకులు కాటమయ్య, వెంకటేశ, రామకృష్ణ, ఓబులేశు తదితరులు పాల్గొన్నారు.