TDP: అర్హులందరికీ పింఛన్లు : పరిటాల శ్రీరామ్
ABN , Publish Date - Dec 02 , 2025 | 12:23 AM
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీతో ప్రతిపేద వాడి ముఖంలో ఆనందం కనిపిస్తోందని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ అన్నారు. ఆయన సోమవారం పట్టణంలోని 27వ వార్డు వైఎస్సార్ కాలనీలో ఎన్టీఆర్‌భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన అందజేశారు.
ధర్మవరం, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీతో ప్రతిపేద వాడి ముఖంలో ఆనందం కనిపిస్తోందని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ అన్నారు. ఆయన సోమవారం పట్టణంలోని 27వ వార్డు వైఎస్సార్ కాలనీలో ఎన్టీఆర్‌భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన అందజేశారు. వృద్ధాప్యంలో తమ కు నెలకు రూ.4వేలు పింఛన అందజేసి ఆదుకుంటున్న ముఖ్య మం త్రి చంద్రబాబునాయుడుకు జీవితాంతం రుణపడి ఉంటామని పలువు రు వృద్ధులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. టీడీపీ నాయకులు పరిశే సుధాకర్, నాగూర్ హుస్సేన, సంధా రాఘవ, భీమనేని ప్రసాద్‌నా యుడు, మాధవరెడ్డి, జింకా పురుషోత్తం, కొత్తపేట ఆది, బొట్టు కిష్ట, జింకల రాజన్న, అస్లాం, చీమల రామాంజి, పూజామొబైల్ సాయి, చీమల సూరి, ఆనందరెడ్డి, బాబూఖాన తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....