EMPLOYEES: పెండింగ్ జీతాలను చెల్లించండి
ABN , Publish Date - Nov 06 , 2025 | 11:52 PM
నాలుగునెలలుగా పెండింగ్‌లో ఉన్న జీత భత్యాలను వెంటనే చెల్లించాలని జిల్లా ఉపాధి హామీ పథకం సిబ్బంది డ్వామా పీడీ విజయేంద్రప్రసాద్‌కు విన్నవించారు. వారు గురువారం జిల్లాకేంద్రంలోని డ్వామా కార్యాల య ప్రాంగణంలో పీడిని కలసి వినతి పత్రం అందచేసిన అనంతరం ఉపాధి హామీ పథకం సిబ్బంది జేఏసీ అధ్యక్షుడు మనోహర్ మాట్లాడుతూ... నాలుగునెలలుగా పెండిం గ్‌లో ఉన్న జీతభత్యాలను వెంటనే చెల్లించాలని కోరారు.
పుట్టపర్తి రూరల్, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): నాలుగునెలలుగా పెండింగ్‌లో ఉన్న జీత భత్యాలను వెంటనే చెల్లించాలని జిల్లా ఉపాధి హామీ పథకం సిబ్బంది డ్వామా పీడీ విజయేంద్రప్రసాద్‌కు విన్నవించారు. వారు గురువారం జిల్లాకేంద్రంలోని డ్వామా కార్యాల య ప్రాంగణంలో పీడిని కలసి వినతి పత్రం అందచేసిన అనంతరం ఉపాధి హామీ పథకం సిబ్బంది జేఏసీ అధ్యక్షుడు మనోహర్ మాట్లాడుతూ... నాలుగునెలలుగా పెండిం గ్‌లో ఉన్న జీతభత్యాలను వెంటనే చెల్లించాలని కోరారు. అలాగే వెల్ఫేర్ సమస్యలు, 23శాతం పీఆర్‌సీ, గ్రేడ్ ఫిక్సేషన, గ్రాట్యుటీ అమలు చేయాలని, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగు లను ఎఫ్‌టీఈలుగా మార్చాలని కోరారు. తమకు న్యాయంగా రావాల్సిన పదోన్నతులను కల్పించాలని, హెల్త్‌కార్డు సమస్యలను వెంటనే పరిస్కరించాలనే డిమాండ్లను సీ ఆర్‌డీ కార్యాలయానికి పంపి న్యాయం చేయాలని వారు పీడీని కోరా రు.
కార్యక్రమంలో ఏఓ శ్రీలక్ష్మి, టెక్నికల్ అసిస్టెంట్ల జేఏసీ అధ్యక్షుడు సాయినాథరెడ్డి యూనియన నాయకులు, బీఎఫ్‌టీలు పాల్గొన్నారు.
సీఎం దృష్టికి తీసుకెళ్లండి
కొత్తచెరువు: తమ సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవనకళ్యాన దృష్టికి తీసుకెళ్లాని డ్వా మా, ఎనఆర్‌జీఎస్ ఉద్యోగుల జేఏసీ నాయకులు పుట్టపర్తి మార్కెట్ యార్డు చైర్మన పూల శివప్రసాద్‌ను కోరారు. వారు గురువారం మా ర్కెట్‌యార్డు చైర్మన పూల శివప్రసాద్‌ను ఆయన స్వగృహంలో పూ లమాల, శాలువాతో సన్మానించారు. అనంతరం వారు తమకు పెం డింగ్‌లో ఉన్న నాలుగు నెలల జీతాలు తదితర సమస్యలతో కూడి న వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు. డ్వామా జేఏసీ అధ్యక్షుడు మనోహర్, టెక్నికల్ అసిస్టెంట్ల అసోసియేషన కార్యదర్శి శ్రీనివాసులు, నాయకులు నంజప్ప, వీరాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....