Share News

DMHO: ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి : డీఎంహెచఓ

ABN , Publish Date - Nov 27 , 2025 | 11:47 PM

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, కావున ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని డీఎంహెచఓ ఫైరోజ్‌ బేగం పేర్కొన్నారు. మండలంలోని బత్తినపల్లిని ఆమె గురువారం సందర్శించారు. రెండు రోజుల క్రితం కలుషి త ఆహా రం తిని గ్రామంలోని పలువురు అస్వస్థతకు గురైన విషయంపై ఆమె గ్రామంలో రోగులతో, గ్రామస్థులతో సమావేశం ఏర్పాటు చేశారు.

DMHO: ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి : డీఎంహెచఓ
DMHO Fairoz Begum examining patients

ఓబుళదేవరచెరువు, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, కావున ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని డీఎంహెచఓ ఫైరోజ్‌ బేగం పేర్కొన్నారు. మండలంలోని బత్తినపల్లిని ఆమె గురువారం సందర్శించారు. రెండు రోజుల క్రితం కలుషి త ఆహా రం తిని గ్రామంలోని పలువురు అస్వస్థతకు గురైన విషయంపై ఆమె గ్రామంలో రోగులతో, గ్రామస్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచఓ మాట్లాడుతూ... మంచి ఆహార అలవాట్లను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. స్థానిక ఆర్డీటీ కమ్యూనిటీ భవనంలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని ఆమె పరిశీలించారు. కలుషి త ఆహారం తిని అస్వస్థతకు గురైనవారిని పరామర్శించారు. అంటువ్యాఽఽ దిగా వ్యాప్తి చెందే నీళ్ల విరేచనాల పట్ల అతి జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆరోగ్య సిబ్బందికి సూచనలు, సలహాలు అందించారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ, ఇతర వాటిని ఆమె పరిశీలించారు. డీఎంహెచఓతో పాటు డిప్యూటీ డీఎంహెచఓ డాక్టర్‌ సునీల్‌, డీపీఎంఓ నాగేంద్రనాయక్‌, వైద్యాధికారి డాక్టర్‌ భానుప్రకాష్‌, వైద్య సిబ్బంది ప్రమీళ, రామకృష్ణమ్మ, దిల్షాద్‌, శ్రావణి, అసినతాజ్‌, అనుసూయ, గోపాల్‌నాయక్‌, ప్రభాక ర్‌, బాలాజీ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Nov 27 , 2025 | 11:47 PM