Share News

WORKERS: వేతన బకాయిలు చెల్లించాలి

ABN , Publish Date - Sep 07 , 2025 | 12:12 AM

తమకు వేతన బకాయిల ను పూర్తి స్థాయిలో చెల్లించాలంటూ చెత్త సేకరణ పారిశుధ్య కార్మికులు మండల సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకున్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శనివా రం నిర్వహించిన సర్వసభ్య సమావేశాన్ని శనివారం ఎంపీపీ సోమశేఖర్‌రెడ్డి ఆధ్వ ర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల పని తీరు, ప్రభుత్వం అంది స్తున్న పథకాలను వివరించారు.

WORKERS: వేతన బకాయిలు చెల్లించాలి
The workers blocked the mandal meeting

మండల సమావేశాన్ని అడ్డుకున్న పారిశుధ్య కార్మికులు

గాండ్లపెంట, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): తమకు వేతన బకాయిల ను పూర్తి స్థాయిలో చెల్లించాలంటూ చెత్త సేకరణ పారిశుధ్య కార్మికులు మండల సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకున్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శనివా రం నిర్వహించిన సర్వసభ్య సమావేశాన్ని శనివారం ఎంపీపీ సోమశేఖర్‌రెడ్డి ఆధ్వ ర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల పని తీరు, ప్రభుత్వం అంది స్తున్న పథకాలను వివరించారు. మండలం లో పలువురు కూలీలకు ఉపాధి బిల్లులు అందలేదని, ట్రాన్సకో ఏఈ అం దుబాటులో లేరని, విద్యుత సమస్యలపై రైతులు ఇబ్బందులు పడుతు న్నారనే పలు అంశాలపై ప్రజాప్రతినిధులు చర్చించారు. ఈ సందర్భంగా తమకు జీతాలు చెల్లంచలేదని చెత్త కార్మికులు సమావేశాన్ని అడ్డుకున్నారు. గతంలో పెండింగ్‌ ఉన్న జీతాలను ఇటీవల విడుదలైన నిధుల నుంచి పూర్తిస్థాయిలో చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గంటపాటు పలు నినాదాలతో సమావేశాన్ని అడ్డుకు న్నారు. అనంతరం ఎంపీడీఓ వెంకటరామి రెడ్డి వారితో మాట్లాడుతూ... చెత్త సేకరణ కార్మికుల జీతాలు అందేలా చర్యలు తీసు కుంటామని తెలుపడంతో వారు ఆందోళన విరమించారు. ఈ సమావేశంలో ఈఓఆర్డీ సునీత, ఎంఈఓ క్రిష్ణానాయక్‌, పలు శాఖల అధికారులు, ఎంపీటీసీ జయరామిక్రిష్ణారెడ్డి, సింగల్‌ విండో అధ్యక్షుడు రామాంజులరెడ్డి, సర్పంచ శివప్పనాయుడు తదితర స్థానిక ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.

Updated Date - Sep 07 , 2025 | 12:12 AM