TDP: ఏర్పాట్లలో పరిటాల శ్రీరామ్ చొరవ
ABN , Publish Date - Sep 11 , 2025 | 12:18 AM
సూపర్ సిక్స్- సూపర్ హిట్ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ ప్రత్యేక చొరవ చూపారు. ఎండ వేడిమి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన సాయం అందిం చేలా ఏర్పాట్లు చేశారు. సభకు భారీగా తరలివస్తున్న ప్రజల కోసం పరిటాల శ్రీరామ్ కుటుంబం తరఫున 1.50లక్ష మందికి పండ్లు, వాటర్ బాటిళ్లు, బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీచేశారు.
ధర్మవరం, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): సూపర్ సిక్స్- సూపర్ హిట్ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ ప్రత్యేక చొరవ చూపారు. ఎండ వేడిమి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన సాయం అందిం చేలా ఏర్పాట్లు చేశారు. సభకు భారీగా తరలివస్తున్న ప్రజల కోసం పరిటాల శ్రీరామ్ కుటుంబం తరఫున 1.50లక్ష మందికి పండ్లు, వాటర్ బాటిళ్లు, బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీచేశారు. తన సొంతఖర్చులతో పరిటాలశ్రీరామ్ ఏర్పాటుచేశారు. అదే విధంగా భోజన వసతి కల్పించారు. రెండు రోజుల పాటు పరిటాలశ్రీరామ్ బృందం శ్రమించి వీటిని ప్యాక్‌చేశారు. సభా వేదిక చుట్టు పక్కల వాహనాల పార్కింగ్ వద్ద 15 బృందాలు వీటిని పంపిణీచేశారు. దీం తో మంత్రులు, ఎమ్మెల్యేలు పరిటాలశ్రీరామ్ చొరవను అభినందించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....