TDP: ప్రజా సమస్యలపై పరిటాల శ్రీరామ్ దృష్టి
ABN , Publish Date - Aug 21 , 2025 | 11:55 PM
పట్టణంలో నిర్వహించిన ‘మీ సమస్య-మా బాధ్యత ’ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిష్కారం కోసం టీడీపీ నియోజకవర ్గఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ గురువారం సచివాలయాల బాట పట్టారు. పట్టణంలోని 25వ వార్డులో పార్థసారఽథి-2, 30వ వార్డు పరిధిలోని దుర్గానగర్ సచివాలయాల వద్దకు స్వయంగా వెళ్లి సచివాలయ సిబ్బందికి అర్జీ లను ఆందజేశారు. టీడీపీ స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ధర్మవరం, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): పట్టణంలో నిర్వహించిన ‘మీ సమస్య-మా బాధ్యత ’ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిష్కారం కోసం టీడీపీ నియోజకవర ్గఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ గురువారం సచివాలయాల బాట పట్టారు. పట్టణంలోని 25వ వార్డులో పార్థసారఽథి-2, 30వ వార్డు పరిధిలోని దుర్గానగర్ సచివాలయాల వద్దకు స్వయంగా వెళ్లి సచివాలయ సిబ్బందికి అర్జీ లను ఆందజేశారు. టీడీపీ స్థానిక నాయకులు పాల్గొన్నారు. ప్రతి అర్జీపై సచివాలయ సిబ్బందితో చర్చించి సమస్య ఎందుకు పరి ష్కారం కాలేదన్న దానిపై ఆరాతీశారు. సిబ్బంది పరిధిలో చేయా ల్సిన వాటిని వెంటనే పరిష్కరించేలా చూడాలన్నారు. సచివాలయ సిబ్బంది చర్యలు మొదలుపెట్టారు. అనంతరం శ్రీరామ్ మాట్లాడు తూ.. ప్రజలు ఇచ్చిన ప్రతి అర్జీకి, దాని స్థాయిని బట్టి సంబంధిత అధికారులు, మంత్రుల వద్దకు వెళ్లి పరిష్కారం చూపుతామన్నారు. మరో వైపు దివ్యాంగుల పింఛన్ల తొలగింపుపై అర్హులెవరూ ఆందో ళన వద్దన్నారు. గత వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున అనర్హులకు అందాయనిని, వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీసీడ్స్ రాష్ట్ర కార్పొరేషన డైరెక్టర్ కమతం కాటమయ్య, నాయకు లు సంధా రాఘవ, ఫణికుమార్, భీమనేని ప్రసాద్‌నాయుడు, మాధవరెడ్డి, శేట్ చంద్ర, పురుషోత్తంగౌడ్, చీమల రామాంజి, భాస్కర్‌చౌదరి పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....