TDP: పరిటాల రవి వ్యక్తి కాదు.. శక్తి
ABN , Publish Date - Aug 31 , 2025 | 12:38 AM
పరిటాల రవి వ్యక్తి కాదు... ఒక శక్తి అని టీడీపీ నా యకులు కొనియాడారు. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 67వ జయంతి సందర్భంగా శనివారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, మాజీ మంత్రి పరిటాల రవి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు.
ధర్మవరం, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): పరిటాల రవి వ్యక్తి కాదు... ఒక శక్తి అని టీడీపీ నా యకులు కొనియాడారు. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 67వ జయంతి సందర్భంగా శనివారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, మాజీ మంత్రి పరిటాల రవి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. అనంతరం ప్రభుత్వాస్పత్రిలో రోగులకు తెలుగుమహిళలు, టీడీపీ నాయకులు పాలు, పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. టీడీపీ కార్యాలయం వద్ద పేదలకు అల్పా హారం విందు ఏర్పా టుచేశారు. పరిటాల రవి ఆశయ సాధనకు పరిటాల శ్రీరామ్ నాయ కత్వంలో ముందుకు వెళ్తున్నామన్నారు. టీడీపీ నాయకులు కమతం కాట మయ్య, చింతలపల్లి మహేశచౌదరి, పరిశే సుధాకర్, ఫణికుమార్, పురు షోత్తంగౌడ్, చింతపులుసు పెద్దన్న, భీమనేని ప్రసాద్‌నాయుడు, మాధవ రెడ్డి, నాగూర్ హుస్సేన, రాళ్లపల్లి షరీఫ్, అత్తర్‌రహీం, జింకల రాజన్న, చీమల రామాంజి, కరెంటు ఆది, రాంపురం శీన, చిన్నూరు విజయ్‌చౌదరి, బొట్టు కిష్ట, సాయిక్రిష్ణ, పల్లపు రవి, బీరే శ్రీరాములు, టైలర్ గోపాల్, అడ్ర మహేశ,, గోసల శ్రీరాములు కేతినేని రాజ తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరంరూరల్: పేదప్రజల ఆశాజ్యోతి పరిటాల రవీంద్ర అని టీడీపీ ధర్మవరం మండల నాయకులు కొనియాడారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మాజీ మంత్రి పరిటాల రవీంద్ర జయంతి వేడుకలకు గ్రామాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివెళ్లారు. కేక్ కట్ చేసి ఆయన సేవలను కొనియాడారు.
బత్తలపల్లి : మండలకేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం మాజీ మంత్రి పరిటాల రవీంద్ర జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కదిరి: మాజీ మంత్రి పరిటాల రవీంద్ర జయంతిని శనివారం స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఇంట్లో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి టీడీపీ నాయకులు నివాళులు అర్పించారు. టీడీపీ రాష్ట్ర మైనారీటీ నాయకురాలు పర్వీనాబాను, మార్కెట్ యార్డు వైస్‌చైర్మన కొమ్మినేని గం గ య్య నాయుడు, కౌన్సిలర్ సావిత్ర మ్మ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు డై మండ్ ఇర్పాన తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....