Share News

MLA: రైతులు నష్టపోకూడదనే పంచసూత్రాలు

ABN , Publish Date - Dec 04 , 2025 | 12:17 AM

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక విధానాలతో ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. అం దుకే పంచసూత్రాలను రూపొందించి రైతులకు అవగాహన కల్పిస్తోం దని పేర్కొన్నారు. మండల పరిధిలోని కురుమామిడి పంచాయతీలో నిర్వహించిన రైతన్నా... మీ కోసం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందికుంట, ఆర్డీఓ వీవీఎస్‌ శర్మ హాజరయ్యారు.

MLA: రైతులు నష్టపోకూడదనే పంచసూత్రాలు
MLA Kandikunta speaking in the meeting

ఎమ్మెల్యే కందికుంట

గాండ్లపెంట, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక విధానాలతో ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. అం దుకే పంచసూత్రాలను రూపొందించి రైతులకు అవగాహన కల్పిస్తోం దని పేర్కొన్నారు. మండల పరిధిలోని కురుమామిడి పంచాయతీలో నిర్వహించిన రైతన్నా... మీ కోసం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందికుంట, ఆర్డీఓ వీవీఎస్‌ శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రైతు సేవా కేంద్రాలలో వ్యవసాయ అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు అందుబాటులో ఉండి రైతులకు సలహాలు, సూచనలు అందించాలని సూచించారు.


అలాగే గత ప్రభుత్వంలో గుంతలమయంగా ఉన్న రాయచోటీ - కదిరి ప్రధాన రహదారిని బాగు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అలాగే మరికొన్ని చోట్ల గాండ్లపెంట, రెక్కమాను, తాళ్ళకాలువ, ఎనపీకుంట, దనియానిచెరువు తదితర ప్రాంతాల్లో కల్వర్టుల పనులు పనులు పూర్తిచేసేందుకు కాంట్రాక్టర్‌తో చర్చించామన్నారు. గాండ్లపెంట మండలానికి కూడా వచ్చే ఏడాది హంద్రీనీవా నీరు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే మండల పరిఽధిలోని పలు తండాలలో ఆర్‌ఓ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ సనావుల్లా, తహసీల్దార్‌ బాబురావు, వ్యవసాయాదికారి షాదాబ్‌, ఎంపీపీ సోమశేఖర్‌రెడ్డి, సర్పంచలు సుధాకర, శివప్పనాయుడు, టీడీపీ మండల కన్వీనర్‌ కొండయ్య, సింగిల్‌విండో అధ్యక్షుడు రామాంజులరెడ్డి, లోకేశ్వర్‌రెడ్డి, అక్రమ్‌ బాష తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Dec 04 , 2025 | 12:17 AM