GOD: పాహిమాం పరమేశ్వరీ..!
ABN , Publish Date - Sep 28 , 2025 | 12:36 AM
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు శనివారం జిల్లా కేంద్రంలోని వాసవీమాత శాకంబరీగా... సత్యమ్మ దేవత, ఎనుమలపల్లి దుర్గాదేవి, మామిళ్ళకుంట లలితా పరమేశ్వరి లలితా త్రిపుర సుందరిగా దర్శమిచ్చారు. ప్రశాంతి నిలయంలోని గాయత్రి మాతకు విశేష అలంకర ణ చేశారు.
(ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్)
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు శనివారం జిల్లా కేంద్రంలోని వాసవీమాత శాకంబరీగా... సత్యమ్మ దేవత, ఎనుమలపల్లి దుర్గాదేవి, మామిళ్ళకుంట లలితా పరమేశ్వరి లలితా త్రిపుర సుందరిగా దర్శమిచ్చారు. ప్రశాంతి నిలయంలోని గాయత్రి మాతకు విశేష అలంకర ణ చేశారు. ధర్మవరం పట్టణంలోని దుర్గమ్మ మీనాక్షిదేవిగా, సాలేవీధి పెద్ద మ్మ, శివానర్ చౌడేశ్వరి రాజేశ్వరిదేవిగా, శ్రీనివాసనగర్‌లో వెంకటేశ్వర స్వామి నరసింహస్వామిగా దర్శనమిచ్చారు. గోరకాటి పెద్దమ్మ, మండలం లోని ఉప్పునేసినపల్లిలో కొల్హాపురమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కొత్తచెరువులోని పెద్దమ్మ లలితత్రిపురసుందరిగా దర్శనమిచ్చారు. రేణుకా యల్లమ్మ, వాసవీ ఆలయాల్లో నవరాత్రిఉత్పవాలు ఘనంగా నిర్వహించా రు. బత్తలపల్లిలో అ మ్మవారు అన్నపూ ర్ణగా దర్శన మిచ్చారు. టీడీపీ నాయకుడు జక్కంపూటి వెంకటేశ్వరచౌదరి అన్నదానం చేశారు. ముదిగుబ్బలోని కన్యకా పరమేశ్వరిని వెంకటేశ్వరస్వామిగా, తాడి మర్రిలో వాసవీ మాతను మధురమీనాక్షిగా అలంకరించారు. కదిరి పట్టణంలో చౌడేశ్వరిని జ్యేష్ఠాదేవిగా, కుమ్మరవాండ్లపల్లి మల్లాలమ్మను మోహినీదేవిగా, మరకత మహాల క్ష్మిని అన్నపూర్ణదేవిగా అలంకరించారు. అమడగూరులో చౌడేశ్వరీ దేవి విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....