CHESS: ఓపెన చెస్ టోర్నీ ప్రారంభం
ABN , Publish Date - Dec 13 , 2025 | 11:36 PM
పట్టణంలోని కొత్తపేట సీతారామాంజినేయస్వామి కల్యాణమండపంలో శనివారం హైబ్రో చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆలిండియా ఓపెన చెస్ పోటీలను ముఖ్య అతిథులుగా హాజరైన ఏపీ చెస్ అసోసియేషన రాష్ట్ర కార్యదర్శి సుమన, టోర్నీ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ చాంద్‌బాషా, హానరబుల్ ప్రెసిడెంట్ డాక్టర్ బీవీ సుబ్బారావు, డైరెక్టర్, హైబ్రో చెస్ అకాడమి నిర్వాహకులు ప్రారంభించారు.
ధర్మవరం, డిసెంబరు 13(ఆంద్రజ్యోతి): పట్టణంలోని కొత్తపేట సీతారామాంజినేయస్వామి కల్యాణమండపంలో శనివారం హైబ్రో చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆలిండియా ఓపెన చెస్ పోటీలను ముఖ్య అతిథులుగా హాజరైన ఏపీ చెస్ అసోసియేషన రాష్ట్ర కార్యదర్శి సుమన, టోర్నీ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ చాంద్‌బాషా, హానరబుల్ ప్రెసిడెంట్ డాక్టర్ బీవీ సుబ్బారావు, డైరెక్టర్, హైబ్రో చెస్ అకాడమి నిర్వాహకులు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 235 మంది చెస్ క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ... ప్రతి క్రీడలోనూ గెలుపోటములు సహజమ న్నారు. ఆదివారం ముగింపు టోర్నీ ఉంటుందని, విజేతలకు బహుమ తులు అందజేస్తామని టోర్నీ డైరెక్టర్ జాకీర్‌హుస్సేన తెలిపారు. ఈ కార్యక్రమంలో యువర్స్ ఫౌండేషన అధ్యక్షుడు శీలా నాగేంద్ర, సెక్రటరీ జయరాం, ట్రెజరర్ వంకదారి మోహన, టోర్నీ ఆర్గనైజింగ్ ప్రసిడెంట్ చాంద్ బాషా, డైరెక్టర్ పోలా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....