TDP:కోటి సంతకాలు.. ఓ కొత్త నాటకం
ABN , Publish Date - Dec 14 , 2025 | 01:09 AM
వైసీపీ నాయకులు చేస్తున్న కోటి సంతకాల కార్యక్రమం ఓ కొత్త నాటకమని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ విమర్శించారు. అర్బన నియోజకవర్గంలో 20మందికి 23.87 లక్షల సీఎంఆర్‌ఎఫ్ నిధులు మంజూరయ్యాయి.
అనంతపురం క్రైం, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకులు చేస్తున్న కోటి సంతకాల కార్యక్రమం ఓ కొత్త నాటకమని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ విమర్శించారు. అర్బన నియోజకవర్గంలో 20మందికి 23.87 లక్షల సీఎంఆర్‌ఎఫ్ నిధులు మంజూరయ్యాయి.
వాటికి సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం చూసి ఓర్వలేక... వైసీపీ నాయకులు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోటి సంతకాలు అని చెబుతూ వారంతకు వారే దొంగ సంతకాలు చేసుకుని ప్రజలు చేసినట్లుగా షో చేస్తున్నారని దుయ్యబట్టారు. రాషా్ట్రన్ని జగన సర్వనాశనం చేస్తే... చంద్రబాబు మళ్లీ గాడిన పెడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..