Share News

ONAM: వైభవంగా ఓనం వేడుకలు

ABN , Publish Date - Sep 06 , 2025 | 12:46 AM

కేరళ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడిన విశిష్టమైన వ్యవసాయ పండుగ ఓనం అని సంస్కృతి స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీ రింగ్‌ ప్రిన్సి పాల్‌ బాలకోటేశ్వరి పేర్కొన్నారు. పదిరోజుల పాటు నిర్వహించే ఓనం వేడుకలను జిల్లాకేంద్రంలోని సంస్కృతి స్కూల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో శుక్రవారం వైభవంగా నిర్వహించారు.

ONAM:  వైభవంగా ఓనం వేడుకలు
Student girls in Kerala traditional dress conducting Deepotsavam

పుట్టపర్తి రూరల్‌, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): కేరళ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడిన విశిష్టమైన వ్యవసాయ పండుగ ఓనం అని సంస్కృతి స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీ రింగ్‌ ప్రిన్సి పాల్‌ బాలకోటేశ్వరి పేర్కొన్నారు. పదిరోజుల పాటు నిర్వహించే ఓనం వేడుకలను జిల్లాకేంద్రంలోని సంస్కృతి స్కూల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో శుక్రవారం వైభవంగా నిర్వహించారు. కళాశాల ప్రాం గణాన్ని అందంగా అలంకరించి దీపోత్సవం నిర్వహించారు. అనం తరం విద్యార్థిని విద్యార్థులు కేరళ జానపద నృత్య ప్రదర్శన చేశా రు. ఈసందర్బంగా ప్రిన్సిపాల్‌ ప్రసంగించారు. అనంతరం ఓనం నేపథ్య ఫ్యాషనషో, ఇంటర్‌ డిపార్టమెంటల్‌ టగ్‌ఆఫ్‌ వార్‌ వంటి స్నేహపూర్వక పోటీలు నిర్వహించి ఓనం సంబరాలు జరుపుకున్నా రు. అధ్యాపక బృందం విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2025 | 12:46 AM