Share News

EDUCATION: అర్ధాంతరంగా ఆగిన నాడు - నేడు

ABN , Publish Date - Aug 07 , 2025 | 12:22 AM

మండల వ్యాప్తంగా నాడు - నేడు పథకం పనులతో పాఠశాలల దశ మారుతుందని ఇటు విద్యార్థులు, అటు తల్లిదండ్రులు ఆశపడ్డారు. అయితే పలు పాఠశాల భవనాలు అర్థాం తరంగా ఆగిపోవడంతో అసౌకర్యాల నడుమ విద్యార్థులు చదువులు కొన సాగిస్తున్నారు. మండలంలోని పాఠశాలల తరగతి గదుల నిర్మాణా లను నూతనంగా చేపట్టి, మోడల్‌ స్కూళ్లుగా తీర్చిదిద్ది ప్రైవేటు విద్యా సంస్థల కు దీటుగా ఉండేలా చేస్తామని గత వైసీపీ పాలనలో అప్పటి పాలకు ఎంతో ఆర్భాటంగా గొప్పలు పలికారు.

EDUCATION: అర్ధాంతరంగా ఆగిన నాడు - నేడు
RV plant and electrical equipment are useless in Vavireddypalli school

- గత వైసీపీ పాలనలోనే నిధులులేక నిలిచిన వైనం

- రెండేళ్లుగా మొండిగోడలకే భవనాలు పరిమితం

- తుప్పు పడుతున్న కడ్డీలు, అదృశ్యమవుతున్న సామగ్రి

- అసౌకర్యాల నడుమ విద్యార్థుల చదువులు

గాండ్లపెంట, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా నాడు - నేడు పథకం పనులతో పాఠశాలల దశ మారుతుందని ఇటు విద్యార్థులు, అటు తల్లిదండ్రులు ఆశపడ్డారు. అయితే పలు పాఠశాల భవనాలు అర్థాం తరంగా ఆగిపోవడంతో అసౌకర్యాల నడుమ విద్యార్థులు చదువులు కొన సాగిస్తున్నారు. మండలంలోని పాఠశాలల తరగతి గదుల నిర్మాణా లను నూతనంగా చేపట్టి, మోడల్‌ స్కూళ్లుగా తీర్చిదిద్ది ప్రైవేటు విద్యా సంస్థల కు దీటుగా ఉండేలా చేస్తామని గత వైసీపీ పాలనలో అప్పటి పాలకు ఎంతో ఆర్భాటంగా గొప్పలు పలికారు. ఆ మేరకు అంగనవాడీ కేంద్రాలు, ప్రాథమిక, ప్రాథకోన్నత, ఉన్నత పాఠశాలలు, కస్తూర్బాగాంధీ బాలికా వి ద్యాలయంలో 22 పనులకు రూ.6 కోట్లుపైగా నిధులతో నిర్మాణాలు చేప ట్టారు. అయితే అర్థాంతరంగా నిర్మాణాలు ఆగిపోయాయి. తాళ్లకాలువ, తూపల్లి, నల్లగుట్టతండా, గాండ్లపెంట, పట్రవాండ్లపల్లి, అరమడకవాండ్ల్ల పల్లిలోని అంగవాడీ కేంద్రాల నిర్మాణం పూర్తి కాలేదు. అలాగే పెద్ద తండా, రెడ్డివారిపల్లి, వద్దిరెడ్డిపల్లి, గాజులవారిపల్లి, కమతంపల్లి, కోటపల్లి, బనాన చెరువుపల్లి, సోమయాజుల పల్లి ప్రాథమిక పాఠశాలలు, సామచేనుబైలు, గాండ్లపెంట, గొడ్డివెలగల ప్రాథమికోన్నత పాఠశాలలు, గాండ్లపెంట, కటా రుపల్లి, రెక్కమాను ఉన్నత పాఠశాలు, కేజీబీవీలో అదనపు గదులు, ప్ర హరీ, మరుగుదొడ్లు, వంట గదులు తదితర వాటి నిర్మాణం అర్ధాంతరం గా ఆగిపోయింది. రెండేళ్ల నుంచి నుంచి వివిధ దశల్లో పనులు ఆగిపోయాయి. దీంత బయట వేసిన ఇసుక, కంకర ఆయా గ్రామాల పరిధిల్లోని ప్రజలు తీసుకెళ్లారని, ఆ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు అర్ధం నిధులు వచ్చాయని, నిధులు లేక పనులు నిలిపివేశామని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

ఉపయోగ పడని పరికరాలు

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అన్నిరకాల వసతులు కల్పించి నాణ్యమైన భోజనం, విద్య అందించాలని ప్రభుత్వ ఉద్దశ్యం. దీంతో పలు పాఠశాలలో విద్యార్థులకోసం ఆర్వోప్లాంట్లు, ఎలక్రికల్‌ సామగ్రి, గ్రీన బోర్డులు తదితర సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. పలు పాఠశాలల్లో తరగతి గదులు, మరుగుదొడ్లు పూర్తి అయినా, వాటికి రంగులు వేయకపోవడంతో దెబ్బతింటున్నాయి. ఇవేకాకుండా ఆర్వోప్లాంట్లు అమర్చినా, విద్యుత కనెక్షన ఇవ్వకపోవడంతో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. కళ్లముందు సామ గ్రి ఉన్నా వినియోగంలో లేని పరిస్థితి నెలకుంది. మరికొన్నిచోట్ల వంట గదుల నిర్మాణం ఆగిపోవడంతో మధ్యాహ్న ఏజెన్సీలు ఇళ్ల వద్దే పిల్లలకు భోజనం వండి పాఠశాలలకు తెస్తున్నారు.


నిధులొస్తే పనులు ప్రారంభిస్తాం

ప్రభుత్వ నిధులు మంజూరు చేస్తే మండలంలో వివిధ దశల్లో నిలిచి పోయిన పాఠశాలల నిర్మాణ పనులను పూర్తి చేస్తామని ఆయా పా ఠశాలల ప్రదానోపాధ్యాయులు అంటున్నారు. అలాగే గతంలో వివిధ నిర్మాణాల కోసం తెచ్చిన కడ్డీలు, ఇసుక, కంకర తదితర వాటిని సెలవు రోజుల్లో కొందరు ఎత్తుకెళుతున్నారని చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతా ధికారులు చొరవ తీసుకుని పాఠశాలల్లో నిర్మాణాలకు సహకరించాలని ప్రధానోపాధ్యాయులు కోరుతున్నారు. పలుచోట్ల విద్యార్థులు మరుగుదొడ్లు, నీటి ట్యాంక్‌లు, ప్రహరీ, వంట గదులు లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వద్దిరెడ్డిపల్లి, గాండ్లపెంట, అంగనవాడీ కేంద్రాల, పాఠశాలల నిర్మా ణాలు నిలిచిపోవడంతో, రంగులు వేయకపోవడంతో ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా కడ్డీలు, గేట్లు, కిటికీలు తుప్పు పడుతున్నాయి. వీటిని ఇలాగే వదిలేస్తే పనికిరాకుండా పోతాయి. అలాగే వాస్‌ బేసిన్ల వద్ద కొళాయిలు లేకపోవడంతో ఉపాధ్యాయులే తెచ్చి బిగిస్తున్నారు. అలాగే ఉంటే ఇనుక చువ్వులు, గోడలు దెబ్బతినే అవకాశముంటుందని ఉపాధ్యా యులు చెబుతున్నారు. దీంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది.

అద్దె భవనాల్లో అంగనవాడీ కేంద్రాలు

మండలంలో అంగనవాడీ కేంద్రాల నిర్మాణానికి రెండోవిడత రూ.16 లక్షలతో ప్రణాళికలు తయారు చేశారు. ఆయా గ్రామాల్లో రెవెన్యూ అధికా రులను సంప్రదించి స్థలాన్ని సేకరించి, నిర్మాణాలు ప్రారంభించారు. అయితే వైసీపీ పాలనలో అంగనవాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేశారు. దీంతో ఆ కేంద్రాల నిర్మాణం ఆగిపోయింది. అయితే తిరిగి ఆయా కేంద్రాల్లో విద్యార్థులను కొనసాగించాలని ప్రభుత్వం చెప్ప డంతో, ప్రస్తుతం అంగనవాడీకేంద్రాలు అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయి.

ప్రభుత్వ ఆదేశాలు అందిన వెంటనే పనులు

- క్రిష్ణానాయక్‌, ఎంఈఓ, గాండ్లపెంట

ప్రభుత్వం రెండువిడత నాడు నేడు పనులకు అనుమతులు ఇచ్చి, నిధులు ఇస్తే వెంటనే పనులు ప్రారంభిస్తాం. ఆగిన పనులను పూర్తి చేసి, విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తాం.


Andhrajyothi, News, Anantapur, puttaparthi, Andhrapradesh

Updated Date - Aug 07 , 2025 | 12:22 AM