Share News

SHIVA RATRI : ఓం శివోహం..!

ABN , Publish Date - Feb 27 , 2025 | 01:32 AM

మహా శివరాత్రి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. జిల్లాలోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. క్యూ లైనలలో నిలబడి మరీ శివపార్వతులను దర్శించుకున్నారు. అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు, కల్యాణోత్సవాలలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. ...

SHIVA RATRI : ఓం శివోహం..!
Tadipatri: Ramalingeswara Swamy on the face of Nandi vehicle

శైవ క్షేత్రాల్లో ఆధ్యాత్మిక సందడి

స్వామివారికి అభిషేకాలు, అర్చనలు

లింగోద్భవ కాలంలో కల్యాణోత్సవం

కాశీ విశ్వేశ్వరుడికి దగ్గుపాటి పట్టువసా్త్రలు

మహా శివరాత్రి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. జిల్లాలోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. క్యూ లైనలలో నిలబడి మరీ శివపార్వతులను దర్శించుకున్నారు. అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు, కల్యాణోత్సవాలలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు.

  • అనంతపురం నగరంలోని మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో వేకువజాము నుంచే కాశీవిశ్వేశ్వరునికి రుద్రాభిషేకాలు, యామపూజలు నిర్వహించారు. అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరరావు స్వామి, అమ్మవార్లకు పట్టువసా్త్రలను సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించుకుని, భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం శివపార్వతుల ఉత్సవ మూర్తులను నందివాహనంపై ఊరేగించారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత లింగోద్భవకాలంలో శివపార్వతుల కల్యాణోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు.


  • శింగనమల భవానీ శంకరాలయంలో స్వామి, అమ్మవార్లకు ఎమ్మెల్యే బండారు శ్రావణి పట్టువసా్త్రలు, మాంగళ్యాన్ని సమర్పించారు. శివపార్వతులకు కల్యాణం జరిపించారు.

  • తాడిపత్రిలోని బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. స్వామివారి మూలవిరాట్‌కు క్షీరాభిషేకం, అర్చనలు నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తిని పుష్పాలతో అలంకరించి నందివాహనంపై ఊరేగించారు.

  • మహాశివరాత్రిని పురస్కరించుకుని గరళ కంఠుడిని స్మరిస్తూ భక్తులు ఉపవాస దీక్షలు చేశారు. ఆలయాలు, ఇళ్ల వద్ద ఆధ్యాత్మిక చింతన, భజనలతో రాత్రి జాగరణ చేశారు. స్వామివారికి ప్రియమైన గుగ్గిళ్లను నైవేద్యంగా సమర్పించారు.

- ఆంధ్రజ్యోతి, అనంతపురం కల్చరల్‌


మరిన్ని అనంతపురం వార్తల కోసం....


Updated Date - Feb 27 , 2025 | 01:32 AM