BABA: ఘనంగా ఓడీసీ బాబా ఆరాఽధనోత్సవం
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:31 PM
మండలకేంద్రంలో వెలసిన హజరత ఓడీసీ బాబా పదో ఆరాఽధనోత్సవాన్ని బాబా దర్గా సన్నిధిలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు బైపరెడ్డి ఆధ్వర్యంలో దర్గా ఆవరణను వివిధరకాల పుష్పాలు, విద్యుతదీపాలతో అలంకరిం చారు. రాత్రి బాగేపల్లి స్వామివారి ఆధ్వర్యంలో గంధోత్సవం నిర్వహించారు. పెనుకొండ ఫకీర్ల జలసాలతో బాబాకు గంధం సమర్పించారు.
ఓబుళదేవరచెరువు, నవంబరు 1(ఆంధ్రజ్యోతి) : మండలకేంద్రంలో వెలసిన హజరత ఓడీసీ బాబా పదో ఆరాఽధనోత్సవాన్ని బాబా దర్గా సన్నిధిలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు బైపరెడ్డి ఆధ్వర్యంలో దర్గా ఆవరణను వివిధరకాల పుష్పాలు, విద్యుతదీపాలతో అలంకరిం చారు. రాత్రి బాగేపల్లి స్వామివారి ఆధ్వర్యంలో గంధోత్సవం నిర్వహించారు. పెనుకొండ ఫకీర్ల జలసాలతో బాబాకు గంధం సమర్పించారు. ఆరాధనోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతలనుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి బాబా సమాధిని దర్శించుకున్నారు. ఆదివారం అన్నదానంతో పాటు రాత్రి ఖవాలీ, సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెన్నెల అస్లం, రఘు, రెడ్డెప్ప, వలి, వేమనారాయణ, హరి, మధుసూదనరెడ్డి తదితరులున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....