SEWAGE: వాన నీరు కాదు - మురుగునీరే..!
ABN , Publish Date - Oct 15 , 2025 | 11:50 PM
మండ ల కేంద్రంలోని వేణుగోపాల్‌నగర్ 40 అడుగుల రహదారిపై చేరిన ఈ నీరు వర్షపునీరు అను కుంటే పొరబడినట్టే. రహదారిలో మురుగునీరు చేరి నిల్వ ఉండడంతో చిన్నపాటి మడుగును తల పిస్తోంది. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావాలం టే ఇబ్బందు పడుతున్నామని ఆ ప్రాంత వాసులు వాపోతున్నారు.
రోడ్డుపై పారుతున్నా పట్టించుకోని పంచాయతీ అధికారులు
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
కొత్తచెరువు, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): మండ ల కేంద్రంలోని వేణుగోపాల్‌నగర్ 40 అడుగుల రహదారిపై చేరిన ఈ నీరు వర్షపునీరు అను కుంటే పొరబడినట్టే. రహదారిలో మురుగునీరు చేరి నిల్వ ఉండడంతో చిన్నపాటి మడుగును తల పిస్తోంది. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావాలం టే ఇబ్బందు పడుతున్నామని ఆ ప్రాంత వాసులు వాపోతున్నారు. మరగునీరు రహదారిపై నిలబడ డంతో వాహనదారులు, పాదాచారులు, చిన్నారు లు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నార న్నారు. ఈ ప్రాంతంలో డ్రైనేజీ కాలువలు లేక పోవడంతో ఎగువ ప్రాంతం నుంచి వచ్చే మురుగు నీరంతా రహదారులపై ప్రవహిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రహదారిలోని గంతల్లో ము రుగు నీరు నిలుస్తోందని తెలిపారు. దాని నుంచి దుర్వాసనతో ఇళ్లల్లో ఉండ లేక పోతున్నామని కాలనీ వాసులు చెబుతున్నారు. ఎవరికైనా జబ్బు చేసినప్పుడు అత్యవసరంగా ఆసుపత్రికి తీసువెళ్లా లంటే ఆటో లు, 108 వాహనం వచ్చేందుకు కూడా వీలు లేకుండా ఉందన్నారు. ఈ ప్రాం తంలో సీసీ రోడ్డుతో పాటు డ్రైనేజీ కాలువ లు ఏర్పాటు చేయాలని పంచాయతీ అధికారుల కు ఎన్నో మార్లు తెలిపినా పట్టించుకోలేదన్నారు. అదే విదంగా బీసీ కాలనీలోని గంగమ్మ గుడివీధిలోను, కుమ్మర కాలనీలోని వీధుల్లో మురుగునీటి ప్రవాహం చిన్న పాటి కాలువలను తలపిస్తున్నా యి. దీంతో ఆ రోడ్లపై వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందు పడుతున్నామని వాహన దారులు, పాదాచారులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, పంచాయతీ అధికారులు స్పందించి డ్రైనేజీ కాలువలు ఏర్పాటుచేయాలని వారు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....