CANAL: కాలువలనూ వదలడం లేదు..!
ABN , Publish Date - Dec 07 , 2025 | 11:58 PM
దారులు, ప్రభుత్వ భూములేకాదు తుదకు వంకలు, వాగులను కూడా వదలడంలేదు. కా లువల పక్కన కొంత భూమి ఉంటే... ఆ భూమితో పాటు కాలువ ఉన్న భూమినే కబ్జాచేసి భవనాలు నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంలో కబ్జాదారుల కన్నుపడితే ఏదీ వదలరనే విమర్శలు వినవస్తు న్నాయి. ఒకప్పుడు చెరువులు, కుంటలు పొంగిపొర్లినపప్పుడు ఆ నీరు వెళ్లేందుకు వంకలు, వాగులు ఉండేవి.
భూమితో పాటు పక్కనున్న కాలువలను ఆక్రమిస్తున్న రియల్ వ్యాపారులు
ముందుకు వెళ్లలేని చెరువు మరువ నీరు
పుట్టపర్తి, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): కబ్జాదారులు, ప్రభుత్వ భూములేకాదు తుదకు వంకలు, వాగులను కూడా వదలడంలేదు. కా లువల పక్కన కొంత భూమి ఉంటే... ఆ భూమితో పాటు కాలువ ఉన్న భూమినే కబ్జాచేసి భవనాలు నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంలో కబ్జాదారుల కన్నుపడితే ఏదీ వదలరనే విమర్శలు వినవస్తు న్నాయి. ఒకప్పుడు చెరువులు, కుంటలు పొంగిపొర్లినపప్పుడు ఆ నీరు వెళ్లేందుకు వంకలు, వాగులు ఉండేవి. రియల్ ఎస్టేట్ వ్యా పారులు తాముకొన్న భూములతో పాటు పక్కనున్న వంకలు, వాగు లను కూడా ఆక్రమిస్తుండడంతో వర్షపు నీరు ముందుకు సాగేందుకు కట్టడాలు అడ్డు వస్తున్నాయి. ఈ ఆక్రమణల గురించి అడిగేవారు లేక ఇష్టారాజ్యంగా కాలువలు సైతం మూసివేశారు.
కుంట, చెరువు నీటికి దారేదీ..?
జిల్లా కేంద్రం సమీపంలోని ఎనుములపల్లి చెరువు బస్సు డిపో వద్ద ఉన్న నార్నే కుంట నిండితే మరువ నీరు వెళ్లేందుకు గతంలో చిన్నపాటి కాలువలు, వంకలు ఉండేవి. అయితే ఎనుములపల్లి నుంచి పుట్టపర్తిలో చిత్రావతి బ్రిడ్జి వరకు గతంలో బైపాస్ రోడ్డు వేశారు. చెరువు నించి మరువనీరు పొంగిపొర్లే సమయంలో ఆ నీరు పారేం దుకు కోసం ఆ రోడ్డులో అప్పట్లో కల్వర్టులు వేశారు.
అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారు లు కల్వర్టులకు అడ్డంగా గోడలు కట్టారు. కొన్ని చోట్ల కల్వర్టులను మట్టితో పూడ్చివేశారు. దీంతో మరువ నీరు వెళ్లేందుకు దారి లేకుండా పోయింది. బస్సు డిపో వద్ద ఉన్న నార్నే కుంట మరువనీరు పారేందుకు ఉన్న కాలువను ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాచేసి భవనాలు నిర్మిస్తున్నారు. కాలువలు, నాళాలను యథేచ్ఛగా కబ్జాచేస్తున్నా అడిగేవారు లేరని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కబ్జాదారులపై విచారణ చేస్తాం- రాజు, ఇరిగేషన ఏఈ
చెరువులు, కుంటలు నిండినప్పుడు మరువనీరు వెళ్లేందుకు ఉన్న కాలువలను మూసివేయడానికి వీల్లేదు. జిల్లా కేంద్రం వద్ద ఏర్పడిన పరిస్థితిపై రెవెన్యూ అధికారులతో చర్చించి సర్వే చేయిస్తాం. కాలువలు, కల్వర్టులు మూసివేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. రెవెన్యూ అధికారులతో సర్వే చేయించి.