JC: అర్జీలపై అలసత్వం వద్దు: జేసీ
ABN , Publish Date - Sep 02 , 2025 | 12:01 AM
తమ సమస్యల పరిస్కారంకోసం వ్యయ ప్రయాసల కోర్చి జిల్లా కేంద్రానికి వచ్చే ఫిర్యాదుదారుల అర్జీల పట్ల ఎటువంటి అలసత్వం వద్దని, సకాలం లో ప్రజల సమస్యలను పరిస్కరించాలని జాయంట్ కలెక్టర్ అభి షేక్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదిక లో జేసీ పాల్గొని జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుం చి 174 ఫిర్యాదులను స్వీకరించారు.
పుట్టపర్తి టౌన, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): తమ సమస్యల పరిస్కారంకోసం వ్యయ ప్రయాసల కోర్చి జిల్లా కేంద్రానికి వచ్చే ఫిర్యాదుదారుల అర్జీల పట్ల ఎటువంటి అలసత్వం వద్దని, సకాలం లో ప్రజల సమస్యలను పరిస్కరించాలని జాయంట్ కలెక్టర్ అభి షేక్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదిక లో జేసీ పాల్గొని జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుం చి 174 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ విజయసారథి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, ఆర్డీఓ సువర్ణ, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, విద్యుతశాఖ ఎస్‌ఈ సంపతకుమార్ తదితరులు పాల్గొన్నారు.
చట్టపరిధిలో ఉన్నవాటికి సత్వర న్యాయం జరగాలి : ఎస్పీ
ప్రజా పిర్యాదుల పరిష్కార వేదికలో (పీజీఆర్‌ఎస్) తమ సమస్యల పరిష్కా రం కోసం వచ్చే ప్రజాఫిర్యాదులపై ప్రత్యేక దృష్టిసారించాలని ఎస్పీ వి. రత్న పోలీసు అధికారులను ఆదేశించారు. చట్టపరిధిలో ఉన్న వాటిని సత్వరమే విచారణ జరిపి ప్రజలకు న్యాయం జరిగే లా చూడాలన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఎస్పీ ఆధ ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారవేదిక నిర్వహిం చా రు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఎస్పీ 45 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం సంబంధిత పోలీ సు అధికారులతో ఫోనలో మాట్లాడారు. కార్యక్రమంలో పుట్టపర్తి డీఎస్పీ విజయ్‌కుమార్, మహిళా పోలీసుస్టేషన డీఎస్పీ ఆదినారా యణ, లీగల్‌సెల్ అడ్వైజర్ సాయినాథరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.