UREA: యూరియా కొరత లేదు: ఆర్డీఓ
ABN , Publish Date - Sep 09 , 2025 | 11:33 PM
యూ రియా కొరత లేదని, అవసరమైన ప్రతి రైతుకు యూరియా పంపి ణీచేస్తామని ఆర్డీఓ సువర్ణ, ఏడీఏ సనావుల్లా తెలిపారు. బుక్క పట్నంలోని ప్రాథమిక సహకార కేంద్రం, పాముదుర్తి రైతు సేవా కేంద్రంలో మంగళవారం యూరియా పంపిణీని పరిశీలించారు. ఇప్పటి వరకు బుక్కపట్నం మండలంలో 80టన్నుల యూరియా అందించామన్నారు.
బుక్కపట్నం /కొత్తచెరువు, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): యూ రియా కొరత లేదని, అవసరమైన ప్రతి రైతుకు యూరియా పంపి ణీచేస్తామని ఆర్డీఓ సువర్ణ, ఏడీఏ సనావుల్లా తెలిపారు. బుక్క పట్నంలోని ప్రాథమిక సహకార కేంద్రం, పాముదుర్తి రైతు సేవా కేంద్రంలో మంగళవారం యూరియా పంపిణీని పరిశీలించారు. ఇప్పటి వరకు బుక్కపట్నం మండలంలో 80టన్నుల యూరియా అందించామన్నారు. అలాగే రైతులందరూ వ్యవసాయ శాస్త్రవేత్తల సూచలన మేరకు నానో యూరియాపై అవగాహన పెంచుకుని పంట దిగుబడులు పెంచుకోవాలన్నారు. బుక్కపట్నం ప్రాథమిక సహాకార సంఘం అధ్యక్షుడు చెన్నక్రిష్ణ, రాష్ట్ర కురబ కార్పొరేషన డైరెక్టర్ శ్రీనివాసు లు, ఇనచార్జ్ తహసీల్దార్ నరసింహులు, ఎఓ నటరాజ్, సాగునీటి సంఘం ఉపాధ్యక్షుడు సంజీవరాయుడు పా ల్గొన్నారు. అలాగే కొత్తచెరువులోని మన గ్రో మార్ సెంటర్ ద్వారా వ్యవసాయాధికారి సతీశబాబు టోకన పద్ధతిలో యూరియా పంపి ణీచేశారు. పంపిణీని ఆర్డీఓ సువర్ణ పరిశీలించారు. మొత్తం 280 యూ రియా బస్తాలను అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏడీఏ క్రిష్ణమీనన, ఏఈఓలు సునీత పాల్గొన్నారు.
కదిరి డివిజనలో 226 టన్నుల స్టాకు: ఏడీఏ
ఫ కదిరిఅర్బన/ గాండ్లపెంట: కదిరి డివిజనలో యూరియా కొరత లేదని వ్యవసాయ శాఖ ఏడీ సన్నావుల్లా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కదిరి డివిజనలోని పది మండలాల్లో 226 మెట్రిక్ టన్నుల యూరియా ప్రైవేటు డీలర్లు, రైతు సేవా కేంద్రా ల్లో పంపిణీకి సిద్ధంగా ఉందన్నారు. యూరియాకు బదులుగా నానో యూరియా వాడకంపై వివరించారు.
ప్రతిరైతుకు యూరి యాను అందిస్తామని ఆర్డీఓ వీవీఎస్ శర్మ మంగళవారం తెలిపా రు. మండలంలోని కుర మామిడి రైతు సేవా కేంద్రాన్ని ఆర్డీఓ మంగళవారం సందర్శించారు. రఅన్ని రైతు సేవా కేంద్రాల్లో ఎరు వులు అందుబాటులోకి తెస్తామనితెలిపారు. కటారుపల్లి రైతు సేవా కేంద్రంలో 140, కురమామడిలో 140 బస్తాల యూరియాను పంపిణీ చేసినట్లు ఏఓ షాదాబ్ తెలిపారు. ఈపంపిణీలో తహసీల్దార్ బావురావు, వీఆర్‌ఓ చంద్ర, సర్పంచలు సుధాకర్, శివప్పనాయుడు తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం రూరల్/పుట్టపర్తి రూరల్: ధర్మవరం మండలం లోని దర్శినమల, ఏలకుంట్ల గ్రామాల రైతు సేవా కేంద్రాలకు 6.3మెట్రిక్ టన్నుల చొప్పున వచ్చిన యూరియాను మంగళవారం ఏఓ ముస్తఫా పరిశీలించారు. అలాగే మండలంలోని మ ల్లాకాల్వ, ఓబుళనా యునిపల్లిలో రైతులతో కలిసి ఏఓ ముస్తఫా పొలంపిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే పుట్టపర్తి రూరల్ మండ లంలోని రైతులందరికి యూరియా అందుబాటు లో ఉందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి శ్రీవాణి పేర్కొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....