Share News

MPP: 12న ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం

ABN , Publish Date - Dec 04 , 2025 | 12:20 AM

స్థానిక ఎంపీపీ ప్రసాద్‌ రెడ్డిపై ఈ నెల 12వ తేదీన అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహిస్తు న్నట్లు ఆర్డీఓ వీవీఎస్‌ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భా గంగా మండలంలో ఉన్న ఎనిమిది మంది ఎంపీటీసీ సభ్యులకు సమా వేశ తేదీని తెలియపరుస్తూ నోటీసులు జారీ జేశారు. ఎనిమిది మంది లో ఆరుగురికి నోటీసులు అందాయి, మరో ఇద్దరు అందులో బాటులో లేనందువల్ల వారికి ఫోనద్వారా తెలియజేసిన ట్లు అధికారులు తెలిపారు.

 MPP: 12న ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం
Amadaguru MPDO Office

ఉత్తర్వులు జారీ చేసిన ఆర్డీఓ

అమడగూరు, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎంపీపీ ప్రసాద్‌ రెడ్డిపై ఈ నెల 12వ తేదీన అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహిస్తు న్నట్లు ఆర్డీఓ వీవీఎస్‌ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భా గంగా మండలంలో ఉన్న ఎనిమిది మంది ఎంపీటీసీ సభ్యులకు సమా వేశ తేదీని తెలియపరుస్తూ నోటీసులు జారీ జేశారు. ఎనిమిది మంది లో ఆరుగురికి నోటీసులు అందాయి, మరో ఇద్దరు అందులో బాటులో లేనందువల్ల వారికి ఫోనద్వారా తెలియజేసిన ట్లు అధికారులు తెలిపారు. ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం తేదీ ఖరారు కావడంతో మండలంలో క్యాంపు రాజకీయాలు ఊపందుకు న్నాయి.


ఈ అంశం వైసీపీలో కలక లం రేపుతోంది. రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత పలు చోట్ల ఎంపీపీ, మున్సిపల్‌ చైర్మన, మేయర్‌లపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. అందులో ఎక్కువ మంది ఎంపీపీలు, మున్సిపల్‌ చైర్మ నలు, మేయర్‌లు వారి స్థానాన్ని ని లుపుకోలేకపోయారు. ప్రస్తుతం పుట్టపర్తి నియోజకవర్గంలోని అమ డగూరు మండలంలో ఎంపీపీ ప్ర సాద్‌రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పె ట్టడంతో నియోజకవర్గం అంతా పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. గతంలో ఎంపీపీ పదవి మార్పుపై పార్టీ తీర్మానాన్ని ఎంపీపీ ఉల్లంఘించారని అందుకు అవిశ్వాస తీర్మా నానికి మద్దతు తెలుపుతున్నట్లు పలువురు ఎంపీటీసీ సభ్యులు చెబుతున్నారు. ఎంఈపీ పదవిని ఆశ్రయిస్తున్న కోగర జయమ్మ మిగి తా సభ్యులందరినీ తన ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Dec 04 , 2025 | 12:20 AM