DUTY: విధుల పట్ల నిర్లక్ష్యం
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:18 AM
మండలకేంద్రంలో గ్రామ సచివాలయం- 1, గ్రామ సచివాలయం- 2 ఉన్నాయి. ఇవి రెండిం టినీ పక్కనపక్కనే నిర్వహిస్తున్నారు. అయితే ఈ రెండు సచివాలయాల సిబ్బంది సమయపాలనపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సచివాలయాలు రెండిట్లో కలిపి గురువారం ఉదయం 11 గంటలైనా ఒకే ఒక ఉద్యోగి విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన సిబ్బంది ఎవ్వరూ హాజరు కాలేదు.
సచివాలయాల సిబ్బంది తీరుపై ప్రజల అసహనం
నంబులపూలకుంట, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలో గ్రామ సచివాలయం- 1, గ్రామ సచివాలయం- 2 ఉన్నాయి. ఇవి రెండిం టినీ పక్కనపక్కనే నిర్వహిస్తున్నారు. అయితే ఈ రెండు సచివాలయాల సిబ్బంది సమయపాలనపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సచివాలయాలు రెండిట్లో కలిపి గురువారం ఉదయం 11 గంటలైనా ఒకే ఒక ఉద్యోగి విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన సిబ్బంది ఎవ్వరూ హాజరు కాలేదు. వివిధ పనుల నిమిత్తం ఆయా సచివాలయాలకు వెళ్లిన ప్రజలు ఈ దృశ్యం చూసి ఆశ్చర్యం వ్యక్తం చశారు. సచివాలయ ఉద్యోగుల సమ యపాలన, విధుల పట్ల వారికి ఉన్న శ్రద్ధపై అసహనం వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయం -2లో కేవలం ఇంజనీరింగ్ అసిస్టెంట్ మాత్రమే ఉన్నారు. సచివాలయం - 1లో సిబ్బంది ఎవరూ లేని పరిస్థితి కనపడింది. ఉయం 11గంటలైన సచివాలయ సిబ్బంది హాజరుకాలేదు. ఇక్కడ దాదాపు నెలరోజులుగా ఈ పరిస్థితి నెలకొందని ప్రజలు వాపోతున్నారు. ఈ విష యాన్ని డిప్యూటీ ఎంపీడీఓ మాధవరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా... పంచాయతీ కార్యదర్శి కూడా విధులకు హాజరుకాలేదా? అని ప్రశ్నించడం గమనార్హం.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....