DDO: పంచాయతీ పాలనలో పారదర్శకత అవసరం : డీడీఓ
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:33 AM
గ్రామపంచాయతీ పా లనలో పారదర్శకత, జవాబుదారీతనం అవసరమని డీడీఓ జనార్దనరావు పేర్కొన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో మం గళవారం సర్పంచలు, పంచాయితీ కార్యదర్శులకు పంచాయతీ అభివృద్ధి సూచిక 2.0వర్క్‌షాపు నిర్వహించారు.
ధర్మవరం రూరల్, సెప్టెంబరు 23 (ఆంరఽధజ్యోతి): గ్రామపంచాయతీ పా లనలో పారదర్శకత, జవాబుదారీతనం అవసరమని డీడీఓ జనార్దనరావు పేర్కొన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో మం గళవారం సర్పంచలు, పంచాయితీ కార్యదర్శులకు పంచాయతీ అభివృద్ధి సూచిక 2.0వర్క్‌షాపు నిర్వహించారు. డీడీఓ హాజరై మాట్లాడారు. పంచాయితీల పనితీరును మెరుగుపరచడం, పారదర్శకత, సమగ్ర అభివృద్ధి సూచీలపై చర్చించారు. అనంతరం ఆయుర్వేద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సాయిమనోహర్, డిప్యూటీ ఎంపీడీఓ ఏలూరి వెంకటేష్, సర్పంచలు ఆనంద్‌రెడ్డి, ముత్యాలప్పనాయుడు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....