DAY: ఘనంగా జాతీయ క్రీడాదినోత్సవం
ABN , Publish Date - Aug 31 , 2025 | 11:49 PM
మండలకేంద్రంలోని ఆర్డీటీ క్రీడా మైదానంలో ఆదివారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్డీటీ ఆధ్వర్యంలో చిల్డ్రన హోం విద్యార్థిని విద్యార్థులతో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఖోఖో, స్కిప్పింగ్, రన్నింగ్, సైకలింగ్, ఫుట్‌బాల్ తదితర ఆటల పోటీలు నిర్వహించారు.ఈ పోటీలలో 21మంది విద్యార్థులు, 22 మంది విద్యార్థినులు పాల్గొన్నారు.
బత్తలపల్లి, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలోని ఆర్డీటీ క్రీడా మైదానంలో ఆదివారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్డీటీ ఆధ్వర్యంలో చిల్డ్రన హోం విద్యార్థిని విద్యార్థులతో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఖోఖో, స్కిప్పింగ్, రన్నింగ్, సైకలింగ్, ఫుట్‌బాల్ తదితర ఆటల పోటీలు నిర్వహించారు.ఈ పోటీలలో 21మంది విద్యార్థులు, 22 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ కీడలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో వార్డెనలు పుష్పలత, యల్లప్ప, ఉపాధ్యాయులు సరోజ, గిరిరాజు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....