Share News

YOGA: యోగా పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపిక

ABN , Publish Date - Dec 16 , 2025 | 12:45 AM

రిథమిక్‌ యోగాసన పెయిర్‌ సబ్‌ జూనియర్స్‌ విభాగం రాష్ట్రస్థాయి పోటీల్లో మండల కేంద్రం లోని శాంతి ఆనంద పాఠశాల విద్యార్థులు మొదటి స్థానం సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బొగ్గు రాజశేఖర్‌ తెలిపారు. ఆయన సోమవారం మాట్లాడుతూ... యోగాసనా స్పోర్ట్స్‌ అసోసియేషన ఆఫ్‌ ఆంధ్రప్రదేశ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అ నంతపురం పీవీకేకే ఇనస్టిట్యూట్‌లో రాష్ట్రస్థాయి యోగా పోటీలు జరిగా యని తెలిపారు.

YOGA: యోగా పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపిక
MEOs felicitating yoga teacher and students

ముదిగుబ్బ, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రిథమిక్‌ యోగాసన పెయిర్‌ సబ్‌ జూనియర్స్‌ విభాగం రాష్ట్రస్థాయి పోటీల్లో మండల కేంద్రం లోని శాంతి ఆనంద పాఠశాల విద్యార్థులు మొదటి స్థానం సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బొగ్గు రాజశేఖర్‌ తెలిపారు. ఆయన సోమవారం మాట్లాడుతూ... యోగాసనా స్పోర్ట్స్‌ అసోసియేషన ఆఫ్‌ ఆంధ్రప్రదేశ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అ నంతపురం పీవీకేకే ఇనస్టిట్యూట్‌లో రాష్ట్రస్థాయి యోగా పోటీలు జరిగా యని తెలిపారు. అందులో తమ పాఠశాలలో ఏడో తరగతి చదువు తున్న గుర్రం మహీధర్‌, సదనపు లక్ష్మీనారాయణ ఆచారి మొదటి స్థా నం సాధించారని తెలిపారు. ఈ నెల 29న మహారాష్ట్రలోని సంఘ మే యర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో ఈ విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రస్థాయి విజేతలయిన విద్యార్థులను, యోగా టీచర్‌ బొగ్గు ప్రభావతిని ఎంఈవోలు వెంకటాచలపతి, రమణప్ప సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బొగ్గు రాజశేఖర్‌, శాంతి ఆనంద ఎడ్యుకేషన సొసైటీ ప్రెసిడెంట్‌ తుమ్మల చంద్రమోహన, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - Dec 16 , 2025 | 12:45 AM