BOARD: సమాచార బోర్డులో మారని పేర్లు
ABN , Publish Date - Dec 08 , 2025 | 12:07 AM
మండలపరిధిలోని కోటపల్లి గ్రామ సచివాలయం వద్ద సమాచార హక్కు చట్టం బోర్టును అఽధికారులు ఏర్పాటు చేశారు. అందులో ఏడాది క్రితం ఉద్యోగ విరమణ పొందిన అధికారుల పేర్లు, బదిలీ అయిన అధికారుల పేర్లే ఇప్పటికీ కనిపిస్తు న్నాయి. ఏడాది కాలంగా పేర్లను మార్చకపోవడాన్ని చూసి పలువురు ఆశ్చర్యం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తనకల్లు, డిసెంబరు7(ఆంధ్రజ్యోతి): మండలపరిధిలోని కోటపల్లి గ్రామ సచివాలయం వద్ద సమాచార హక్కు చట్టం బోర్టును అఽధికారులు ఏర్పాటు చేశారు. అందులో ఏడాది క్రితం ఉద్యోగ విరమణ పొందిన అధికారుల పేర్లు, బదిలీ అయిన అధికారుల పేర్లే ఇప్పటికీ కనిపిస్తు న్నాయి. ఏడాది కాలంగా పేర్లను మార్చకపోవడాన్ని చూసి పలువురు ఆశ్చర్యం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమాచార అధికారిగా ఉద్యోగ విరమణ పొందిన ఈఓఆర్డీ ఆనందయ్య పేరు, అప్పిలేట్ అధికారిగా ఉద్యోగ విరమణ పొందిన ఎంపీడీఓ నరసింహుల పేర్లు, సహాయ సమాచార అధికారిగా బదిలీ అయిన పంచాయతీ కార్యదర్శి శ్యామ్ కుమార్ పేరునూ ఆ బోర్టు మీద అలాగే ఉన్నాయి. మన అధికారులకు సమాచార హక్కు చట్టం పట్ల ఎంత అలసత్వం ఉందో దీని ద్దారానే అర్థమవుతోంది. వారు ఉద్యోగ విరమణ చేసి యేడాది అవుతున్నా, ఇంకా ఆ అధికారుల పేర్లే సమాచార హక్కు బోర్డుపై ఉండడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కనీసం సచివాలయం తనిఖీలకు వెళ్తే మండలస్థాయి అధికారులు కూడా సమాచార హక్కు చట్టం బోర్టుపై ఇంత నిర్లక్ష్యంగా ఉండడం ఎంతవరకు సబబని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమాచార హక్కు బోర్డు లో ప్రస్తుతం ఉన్న అధికారుల పేర్లు చేర్చాలని ప్రజలు కోరుతున్నారు.