COLLECTOR: మునగ సాగును ప్రోత్సహించాలి
ABN , Publish Date - May 24 , 2025 | 11:54 PM
జిల్లాలో మునగ పంట సాగును ప్రోత్స హించా లని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. ఆయన శనివారం కలెక్టరట్‌లో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో స మావేశం నిర్వహించా రు. ఈ సందర్బంగా కలె క్టర్ మాట్లాడుతూ ము నగలో అద్బుతమైన పోషకాలు ఉన్నాయన్నారు.
అనంతపురం టౌన, మే 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మునగ పంట సాగును ప్రోత్స హించా లని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. ఆయన శనివారం కలెక్టరట్‌లో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో స మావేశం నిర్వహించా రు. ఈ సందర్బంగా కలె క్టర్ మాట్లాడుతూ ము నగలో అద్బుతమైన పోషకాలు ఉన్నాయన్నారు. మరోవైపు రైతులకు లాభదాయకమైన పంట అన్నారు. ఇలాంటి పంటలపై రైతులకు అవ గాహన కల్పించి అధికంగా సాగుచేసేలా చూడాల్సిన అవసరం ఉంద న్నారు. రాయదుర్గం నియోజకవర్గాలలో ప్రతి మండలంలో వంద ఎకరాల్లో మునగ సాగు లక్ష్యంగా పెట్టుకుంటే అక్కడ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటుచేస్తామన్నారు. ఎకరాకు ఆరు వేల నుంచి ఎనిమిది వేల మునగమొక్కలు నాటవచ్చన్నారు. మునగను ఆహారంగానే కా కుండా ఔషధ తయారీలో పౌడర్‌గా, నూనెగా తయారు చేసి ఉపయో గించవచ్చన్నారు. రైతులు పెద్దఎత్తున ఈ పంట సాగుకు ముందుకు వచ్చేవిధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయశాఖ జేడీ ఉమా మహేశ్వరమ్మ, డీఆర్‌డీఏ పీడీ శైలజ, పశసంవవర్ధకశాఖ జేడీ వెంకటస్వామి, హార్టికల్చర్ డీడీ రఘునాథరెడ్డి, ఏడీ ఫిరోజ్‌ఖాన, డీపీఎం లక్ష్మానాయక్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....