MRC: వర్షానికి తడుస్తున్న ఎమ్మార్సీ
ABN , Publish Date - Aug 21 , 2025 | 11:47 PM
మండలకేంద్రంలోని జిల్లాపరిషత ఉన్నతపాఠశాల ఆవరణంలో ఉన్న ఎమ్మార్సీ కార్యాలయం ఇటీవల కురిసిన వర్షానికి కారుతోంది. ఈ భవనాన్ని 1999లో నిర్మించారు. ఈ కార్యాలయంలో ఇద్దరు ఎంఈఓలు, ఒక ఎంఐసీ కోఆర్డినేటర్, ఓ ఆపరేటర్, ఓ మెసెంజర్ విధులు నిర్వహిస్తుంటారు. మండల వ్యాప్తంగా 63 ప్రభుత్వ పాఠశాలలున్నాయి.
నంబులపూలకుంట, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలోని జిల్లాపరిషత ఉన్నతపాఠశాల ఆవరణంలో ఉన్న ఎమ్మార్సీ కార్యాలయం ఇటీవల కురిసిన వర్షానికి కారుతోంది. ఈ భవనాన్ని 1999లో నిర్మించారు. ఈ కార్యాలయంలో ఇద్దరు ఎంఈఓలు, ఒక ఎంఐసీ కోఆర్డినేటర్, ఓ ఆపరేటర్, ఓ మెసెంజర్ విధులు నిర్వహిస్తుంటారు. మండల వ్యాప్తంగా 63 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సం బంధించిన వివరాలు ఎప్పటికప్పుడు తీసుకుని జిల్లా విద్యాశాఖకు పం పేందుకు ఈ కార్యాలయం వారధిగా పనిచేస్తుంది. ఈ కార్యాలయంలోని కంప్యూటర్‌లో ఉపాధ్యాయులు, విద్యార్థుల వివరాలు పొందు పరిచి ఉంటా రు. వర్షం నీరడం వల్ల కంప్యూటర్లు దెబ్బతింటే ఉపాధ్యా యులు, విద్యార్థు లు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కావున ఎమ్మార్సీ భవనం మరమ్మతులు చేయాల్సిన అసవరం ఎంతైనా ఉందని పలువురు అంటున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....