Share News

TDP: కడపలో మహానాడుకు తరలిరండి: ఎమ్మెల్యే

ABN , Publish Date - May 24 , 2025 | 11:50 PM

కడపలో ఈ నెల 27వ తేదీ నుంచి జరిగే రాష్ట్ర స్థాయి టీడీపీ మహానాడు వేడు కలకు పెద్దఎత్తున నా యకులు, కార్యకర్తలు తరలిరావాలని ఎ మ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ పిలుపునిచ్చారు. ఆయ న శనివారం టీడీపీ జిల్లా కార్యా లయంలో పార్టీ జిల్లా అధ్య క్షుడు వెంకటశివుడు యాదవ్‌, నియోజక వర్గ పరిశీలకుడు లక్ష్మీనారాయణతో కలిసి అనంతపురం అర్బన నాయ కులతో సమావేశమయ్యారు.

TDP: కడపలో మహానాడుకు తరలిరండి: ఎమ్మెల్యే
MLA Daggupati discussing with the leaders

అనంతపురం అర్బన, మే 24 (ఆంధ్రజ్యోతి): కడపలో ఈ నెల 27వ తేదీ నుంచి జరిగే రాష్ట్ర స్థాయి టీడీపీ మహానాడు వేడు కలకు పెద్దఎత్తున నా యకులు, కార్యకర్తలు తరలిరావాలని ఎ మ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ పిలుపునిచ్చారు. ఆయ న శనివారం టీడీపీ జిల్లా కార్యా లయంలో పార్టీ జిల్లా అధ్య క్షుడు వెంకటశివుడు యాదవ్‌, నియోజక వర్గ పరిశీలకుడు లక్ష్మీనారాయణతో కలిసి అనంతపురం అర్బన నాయ కులతో సమావేశమయ్యారు. మహానాడుకు తరలివెళ్లేం దుకు చేయాల్సిన ఏర్పాట్ల పై చర్చించారు. ఈనెల 27 నుంచి మూడు రోజులపాటు కడపలో మహా నాడు జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడు తూ.... మహానాడులో తొలి రోజు పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి, రెండో రోజు ఈ ప్రభుత్వ ఏడాది విజయంపై చర్చ, మూడో రోజు ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ ని ర్వహించాలని అధిష్టానం నిర్ణయిం చిందని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మూడో రోజు బహిరంగ సభకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మహానాడుకు వచ్చే కార్యకర్తలకు ఎక్కడా ఎలాం టి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పా ట్లు చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు గంగారామ్‌, తలారి ఆదినారాయణ, బుగ్గయ్య చౌదరి, లక్ష్మీనరసింహ, ఫిరోజ్‌ అహ్మద్‌, స్వామిదాస్‌, రమేష్‌, ముక్తియార్‌, చేపల హరి, ఉమర్‌ తదితరులు పాల్గొన్నారు.

మహానాడు ఏర్పాట్ల పరిశీలన : కడపలో మహానాడు ఏర్పాట్లను శనివారం సాయంత్రం ఎమ్మెల్యే దగ్గుపాటి పరిశీలించారు. మంత్రులు నిమ్మలరామానాయుడు, బీసీ జనార్దనరెడ్డి, ఏడీసీసీ బ్యాంక్‌ చైర్మన ముం టిమడుగు కేశవరెడ్డి, ఇతర నాయకులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 24 , 2025 | 11:50 PM