MINISTER: ప్రపంచ వేదికపై దేశగౌరవాన్ని నిలిపిన మోదీ
ABN , Publish Date - Sep 29 , 2025 | 12:07 AM
భారత గౌరవాన్ని ప్రపంచ వేది కపై నిలబెట్టిన వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అని రాష్ట్ర వైద్య ఆరో గ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలపై ప్రత్యేక ప్రదర్శనను పట్టణం లోని ఎన్టీఆర్ సర్కిల్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్
ధర్మవరం,సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): భారత గౌరవాన్ని ప్రపంచ వేది కపై నిలబెట్టిన వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అని రాష్ట్ర వైద్య ఆరో గ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలపై ప్రత్యేక ప్రదర్శనను పట్టణం లోని ఎన్టీఆర్ సర్కిల్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ...మన దేశ ప్రగతికి, పేదల సంక్షేమానికి, రైతుల అభ్యు న్నతికి, మహిళల సాధికారతకు ప్రధాని అమలు చేసిన పథకాలు చరిత్రాత్మకమైనవన్నారు. ప్రధాన మంత్రి జనధన యోజన ద్వారా పేదల కు బ్యాంక్‌ఖాతాలు, ఉజ్వల యోజన ద్వారా గ్యాస్‌కనెక్షనలు, ఆయుష్మాన భారత ద్వారా ఉచిత వైద్యబీమా, ప్రధానమంత్రి కిసాన సమ్మాన నిధి ద్వారా రైతులకు ఆర్థికసాయం, స్వచ్చభారత మిషన ద్వారా శుభ్రత వంటి పథకాలన్నీ దేశవ్యాప్తంగా ప్రజల్లో కొత్త ఆశలు నింపాయన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాకే ఓబుళేశు, పట్టణ అధ్యక్షుడు జింకా చంద్ర, రూరల్ అద్యక్షుడు గొట్లూరు చంద్ర, నాయకులు గుండా పుల్లయ్య, నబీరసూల్ పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....