MLA: ఇజ్‌తమా ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే
ABN , Publish Date - Dec 08 , 2025 | 12:17 AM
పట్టణంలో ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే ఇజ్‌తమా ఏర్పాట్లను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆది వారం పరిశీలించారు. ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కదిరిలోని బైపాస్ రోడ్డులో ముస్లింలు ఇజ్‌తమా నిర్వహిస్తున్నారు. అందుకు కావలసిన మైదానం, ఏర్పాట్లును ముస్లిం మత పెద్దలతో కలిసి పరిశీలించారు.
కదిరి, డిసెంబరు7 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే ఇజ్‌తమా ఏర్పాట్లను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆది వారం పరిశీలించారు. ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కదిరిలోని బైపాస్ రోడ్డులో ముస్లింలు ఇజ్‌తమా నిర్వహిస్తున్నారు. అందుకు కావలసిన మైదానం, ఏర్పాట్లును ముస్లిం మత పెద్దలతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వం ద్వారా ఇజ్‌తమాకు కావలసిన ఏర్పాట్లు అన్ని చేస్తామన్నారు. ఇంకా అవసరమైతే తనను సంప్రదించాలని ఆయన తెలిపారు. ఆయ నతో పాటు మున్సిపల్ కమిషనర్ కిరణ్‌కుమార్, డీఎస్పీ శివనారాయణ స్వామి, సీఐలు నారాయణరెడ్డి, నీరంజనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....