Nara Lokesh: పుట్టపర్తిలో లోకేశ్ ప్రజాదర్బార్.. కౌసల్యపై ప్రశంసలు
ABN , Publish Date - Nov 23 , 2025 | 09:29 PM
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పుట్టపర్తిలో ప్రజా దర్బార్ నిర్వహించారు. లోకేశ్‌ను ప్రజలు, కార్యకర్తలు కలిసి.. తమ సమస్యలు విన్నవించుకున్నారు. వీటిని పరిష్కరిస్తానని వారికి మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు.
పుట్టపర్తి, నవంబర్ 23: ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదివారం శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని క్యాంప్ సైట్‌లో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు వినతులు వెల్లువెత్తాయి. ప్రజలు, కార్యకర్తల నుంచి వచ్చిన వినతులను ఆయన స్వీకరించారు. వారి సమస్యలను ఆయన సావధానంగా విన్నారు. ఈ సమస్యలు పరిష్కరిస్తానని ఈ సందర్భంగా వారికి మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. అందుకు సంబంధించిన అంశాలను.. తన ఎక్స్ ఖాతా వేదికగా మంత్రి నారా లోకేశ్ వివరించారు.
అలాగే అనంతపురం జిల్లా, గుమ్మఘట్ట మండలం పైదొడ్డి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పనిచేస్తున్న బుకెరామిరెడ్డిపల్లి కౌసల్య.. పాఠశాల విద్యార్థులకు బోధిస్తున్న తీరు పట్ల మంత్రి లోకేశ్ తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా కౌసల్య టీచర్‌కు మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. టీచర్ కౌసల్య.. విద్యార్థులకు బోధించిన పద్దతులు ఉన్న వీడియోను మంత్రి నారా లోకేశ్ తన ఎక్స్ ఖాతా వేదికగా షేర్ చేశారు.