Share News

COLLECTOR: వైద్యసేవలు మెరుగుపడాలి: కలెక్టర్‌

ABN , Publish Date - Dec 02 , 2025 | 11:59 PM

జిల్లాలోని అన్ని ప్రభు త్వ ఆస్పత్రుల్లో వైద్యసేవల మెరుగుపడాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో వైద్యాధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. వైద్య పరీక్షలు, మందులు, అత్యవసర సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల ని డీసీహెచఎ్‌స, డీఎంహెచఓకి సూచించారు.

COLLECTOR: వైద్యసేవలు మెరుగుపడాలి: కలెక్టర్‌
Collector Shyamprasad talking to officials

పుట్టపర్తి టౌన, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అన్ని ప్రభు త్వ ఆస్పత్రుల్లో వైద్యసేవల మెరుగుపడాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో వైద్యాధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. వైద్య పరీక్షలు, మందులు, అత్యవసర సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల ని డీసీహెచఎ్‌స, డీఎంహెచఓకి సూచించారు. భవన నిర్మాణాల వేగం పెంచాలన్నారు. సమావేశంలో డీసీహెచఎ్‌స డాక్టర్‌ మధుసూదన, డీఎంహెచఓ ఫైరోజ్‌ బేగం, వైద్యాధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా ఈనెల 5న నిర్వహించనున్న మెగా పీటీఎం విజయవంతం చేయాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ ప్రకటనలో కోరారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కార్యక్రమం నిర్వహించాలన్నారు.

Updated Date - Dec 02 , 2025 | 11:59 PM