GOD: మాతా అన్నపూర్ణేశ్వరీ..!
ABN , Publish Date - Sep 25 , 2025 | 12:18 AM
దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు మూడో రోజు బుధవారం భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. ధర్మవరంలోని దుర్గమ్మ ఆలయంలో అన్నపూర్ణేశ్వరి ఆలంకర ణలో దుర్గమ్మ, కొత్తపేట వెంకటేశ్వరస్వామి బాలాత్రిపురసుందరిగా, గాంధీ నగర్ చౌడేశ్వరీదేవి, దుర్గమ్మ, వాసవీమాత అన్నపూర్ణేశ్వరిగా, సంతాన లక్ష్మీదేవిగా సాలేవీధి పెద్దమ్మ, వరహావతార అలంకరణలో శ్రీనివాసనగర్ లో వేంకటేశ్వరస్వామి భక్తులకు దర్శనమిచ్చారు.
(ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్)
దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు మూడో రోజు బుధవారం భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. ధర్మవరంలోని దుర్గమ్మ ఆలయంలో అన్నపూర్ణేశ్వరి ఆలంకర ణలో దుర్గమ్మ, కొత్తపేట వెంకటేశ్వరస్వామి బాలాత్రిపురసుందరిగా, గాంధీ నగర్ చౌడేశ్వరీదేవి, దుర్గమ్మ, వాసవీమాత అన్నపూర్ణేశ్వరిగా, సంతాన లక్ష్మీదేవిగా సాలేవీధి పెద్దమ్మ, వరహావతార అలంకరణలో శ్రీనివాసనగర్ లో వేంకటేశ్వరస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే దర్మవరంలోని గో రకాటి పెద్దమ్మ, మండలంలోని ఉప్పునేసినపల్లిలో కొల్లాపురమ్మ ఆలయా ల్లో ప్రత్యేక పూజలు చేశారు. కొత్తచెరువులోని పెద్దమ్మ అన్నపూర్ణేశ్వరి దేవిగా, బత్తలపల్లిలో కొలువుదీర్చిన అమ్మవారు ప్రత్యేక అలంకరణలో, కదిరి పట్టణంలో గౌరీదేవిగా చౌడేశ్వరీ, రాజరాజేశ్వరిగా కదిరికొండ చౌడే శ్వరి, మధురమీనాక్షి అలంకరణలో వాసవీమాత దర్శనమిచ్చారు. అమ డగూరులో అన్నపూర్ణదేవిగా చౌడేశ్వరిని అలంకరించారు.