Share News

MLA: అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం

ABN , Publish Date - Oct 15 , 2025 | 11:54 PM

నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ తెలిపారు. ని యోజవర్గంలో చేపట్టిన, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై ఆయన బుధ వారం పట్టణంలోని అర్‌ అండ్‌ బీ బంగ్లాలో వివిధ శాఖల అధికారులు, ఇంజనీర్ల తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరిగేషన అధికారులు, ఇంజనీర్ల సమీక్షలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.

MLA: అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం
MLA holding review with irrigation officials

ఎమ్మెల్యే కందికుంట ఫ అధికారులతో సమీక్ష

కదిరి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ తెలిపారు. ని యోజవర్గంలో చేపట్టిన, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై ఆయన బుధ వారం పట్టణంలోని అర్‌ అండ్‌ బీ బంగ్లాలో వివిధ శాఖల అధికారులు, ఇంజనీర్ల తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరిగేషన అధికారులు, ఇంజనీర్ల సమీక్షలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా హంద్రీ నీవా కాలువ ద్వారా నియోజకవర్గంలో 33 చెరువులకు నీళ్లు అందిస్తున్నట్లు తెలియ జే శారు. తద్వారా ఇప్పటికే 22 చెరువులు నిండాయని అన్నారు. పుంగనూరు బ్రాంచ కెనాల్‌ ద్వారా కదిరి, నల్లచెరువు, తనకల్లు మండలా ల్లోని చెరువులను నింపినట్లు తెలిపారు. అదే విధంగా మెయిన బ్రాంచ కెనాల్‌ ద్వారా తలుపుల మండలంలోని కొండారెడ్డి చెరువు నిండిందని, మిగిలిన చెరువులకు నీరు వెళుతున్నట్లు వివరించారు. హంద్రీనీవా నీరు గాండ్లపెంట మండలానికి నీళ్లు వెళ్లే విధంగా పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. లిఫ్ట్‌ ఇరిగేషన ద్వారా ఆ మండలంలో చెరువులకు నీరు అందిం చనన్నుట్లు వివరించారు. ఇందుకు కోసం రూ.46 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. గాండ్లపెంట, నల్లచెరువు, కదిరి, నంబులపూలకుంట మండలాల్లో మరో 25 చెరువులకు నీరు ఇవ్వనున్నట్లు తెలిపారు. అదేవిధంగా విద్యుత, హౌసింగ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Oct 15 , 2025 | 11:54 PM