Share News

RDT: మహిళల ఆర్థికాభివృద్ధికే మహిళా బ్యాంకు

ABN , Publish Date - Aug 22 , 2025 | 12:02 AM

మహిళలు ఆర్థికాభి వృద్ధి దిశగా ముందుకెళ్లాలనే లక్ష్యంతో మహిళల బ్యాంకు ఏర్పాటు చేశామని ఆర్డీటీ మహిళ విభాగం డైరెక్టర్‌ విశాలఫెర్రర్‌ పేర్కొన్నా రు. పట్టణంలోని షీర్డీసాయిబాబా ఫంక్షనహాల్‌లో గురువారం ఆర్డీ టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్న శ్రీఅక్షర మహిళ బ్యాంకును ఆమె ప్రారంభించారు.

RDT: మహిళల ఆర్థికాభివృద్ధికే మహిళా బ్యాంకు
Visalaferrer speaking at the meeting

ఆర్డీటీ మహిళా విభాగం డైరెక్టర్‌ విశాలఫెర్రర్‌

ధర్మవరం రూరల్‌, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): మహిళలు ఆర్థికాభి వృద్ధి దిశగా ముందుకెళ్లాలనే లక్ష్యంతో మహిళల బ్యాంకు ఏర్పాటు చేశామని ఆర్డీటీ మహిళ విభాగం డైరెక్టర్‌ విశాలఫెర్రర్‌ పేర్కొన్నా రు. పట్టణంలోని షీర్డీసాయిబాబా ఫంక్షనహాల్‌లో గురువారం ఆర్డీ టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్న శ్రీఅక్షర మహిళ బ్యాంకును ఆమె ప్రారంభించారు. 40గ్రామాల నుంచి 700మంది మహిళా సంఘా ల సభ్యులు హాజరయ్యారు. విశాలఫెర్రర్‌ మాట్లాడుతూ... ప్రస్తుత సమాజంలో మహిళగా విలువ, గౌరవం, సమానత్వం పొందడంతో పాటు ఆర్థికాభివృద్ది సాధించి వ్యాపారవేత్తలుగా తయారు కావడ మే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమన్నారు. ఈ బ్యాంకును మహిళలే నడుపుతారని, లాభనష్టాలను వారే పంచుకుంటారని తెలిపారు. ఈ గొప్ప కార్యక్రమానికి ఇది ముందడుగుగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీటీ ఆర్డీ హనుమంతప్ప, షెబ్బా, ఏటీఎల్‌ శ్రీనివాసులు, ఆర్డీటీ సిబ్బంది పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Aug 22 , 2025 | 12:02 AM