Share News

ELECTRICITY: తక్కువ ఎత్తులో విద్యుత తీగలు

ABN , Publish Date - Sep 06 , 2025 | 12:19 AM

పట్టణంలోని ఎనిమిదో వార్డు కేశవనగర్‌లో విద్యుత తీగలు అతి తక్కువ ఎత్తులో ప్రమాదకరంగా ఉన్నాయి. తక్కువ ఎత్తులో ఉం డటం వల్ల వాహనాలలో వెళ్లే వారికి తగిలే విధంగా ఉన్నా యి. ఈ విషయాన్ని పది నెలల నుంచి విద్యుత శాఖ అదికారులకు తెలియజేస్తున్నా నిర్లక్ష్యంగా వ్యహరి స్తున్నారని స్థానికులు వాపోతున్నారు.

ELECTRICITY: తక్కువ ఎత్తులో విద్యుత తీగలు
Low height power lines, transformer

ప్రమాదకరంగా ట్రాన్సఫార్మర్‌

ధర్మవరం, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఎనిమిదో వార్డు కేశవనగర్‌లో విద్యుత తీగలు అతి తక్కువ ఎత్తులో ప్రమాదకరంగా ఉన్నాయి. తక్కువ ఎత్తులో ఉం డటం వల్ల వాహనాలలో వెళ్లే వారికి తగిలే విధంగా ఉన్నా యి. ఈ విషయాన్ని పది నెలల నుంచి విద్యుత శాఖ అదికారులకు తెలియజేస్తున్నా నిర్లక్ష్యంగా వ్యహరి స్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికే చాలా మంది విద్యుదాఘాతానికి గురయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. అదేవిధఽంగా ట్రాన్సపార్మర్‌ మూడు అడుగుల ఎత్తులో ఉంది. అటు వైపు వెళ్లే చిన్నారులు, వృద్ధులు ఏమరపా టున అక్కడికి వెళితే విద్యుదాఘాతకానికి గుర య్యే ప్రమాదం ఉందంటున్నారు. విద్యుత అదికా రులు, సిబ్బందికి ఈ విషయాన్ని తెలియజే శామని, అయినా ఈ సమస్యను పెడచెవిన పెడుతున్నారన్నారు. ప్రాణాలు పోతే కానీ విద్యుత అధికారులు స్పందించరా అని ప్రజలు మండిపడుతున్నారు. వర్షాకా లంలో ప్రజలకు ప్రమాదం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత శాఖ అధికారులు ఇప్పటికైన స్పందించి వెంటనే తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత తీగలు, ట్రాన్సపార్మర్‌ను ఎత్తులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Sep 06 , 2025 | 12:19 AM