GARBAGE: చెత్తను ఎత్తివేయరూ...
ABN , Publish Date - Nov 20 , 2025 | 12:39 AM
మండల కేంద్రంలోని గ్రామ సచివాలయం-2 ఎదుట చెత్తపేరుకుపోయింది. దీంతో దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు వాపోతున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారు చెత్తను, వస్తువులను తెచ్చి సచివాలయం ఎదుట పడేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
కొత్తచెరువు, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని గ్రామ సచివాలయం-2 ఎదుట చెత్తపేరుకుపోయింది. దీంతో దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు వాపోతున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారు చెత్తను, వస్తువులను తెచ్చి సచివాలయం ఎదుట పడేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అవి పేరుకుపోయిన చెత్త దిబ్బలా తయారైంద న్నారు. ఈ దారి గుండా సోమేశ్వరస్వామి, ఆంజనేయస్వామి ఆలయాల కు వెళ్లే భక్తులు ఆ చెత్త నుంచి వచ్చే దుర్వాసనతో భరించలేకపోతు న్నామని వాపోతున్నారు. చెత్తను తొలగించాలని పలుమార్లు పంచా యతీ అధికారులకు తెలియజేసిన పట్టించుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్సటికైనా అధికారులు స్పందించి చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.