Share News

MAGISTRATE: రాజీ మార్గంతో జీవితం సుఖమయం

ABN , Publish Date - Dec 13 , 2025 | 11:32 PM

రాజీమార్గంతోనే జీవితం సుఖమయంగా ఉంటుందని న్యాయాధికారు లు పేర్కొన్నారు. ధర్మవరం, పుట్టపర్తి, కదిరి కోర్టులలో శనివారం న్యా యాధికారుల ఆధ్వర్యంలో జాతీయ మెగాలోక్‌ అదాలత కార్యక్రమాన్ని నిర్వహించారు. ధర్మవరం కోర్టులో సీనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయాధికారి వెంకటేశ్వర్లు, జూని యర్‌ సివిల్‌ కోర్టు న్యాయాధికారి పీడీఎం నందిని పాల్గొన్నారు.

MAGISTRATE: రాజీ మార్గంతో జీవితం సుఖమయం
Magistrate and lawyers who participated in the Lok Adalat at Dharmavaram

లోక్‌అదాలతలో న్యాయాధికారులు

ధర్మవరం/ పుట్టపర్తి రూరల్‌/ కదిరిలీగల్‌, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): రాజీమార్గంతోనే జీవితం సుఖమయంగా ఉంటుందని న్యాయాధికారు లు పేర్కొన్నారు. ధర్మవరం, పుట్టపర్తి, కదిరి కోర్టులలో శనివారం న్యా యాధికారుల ఆధ్వర్యంలో జాతీయ మెగాలోక్‌ అదాలత కార్యక్రమాన్ని నిర్వహించారు. ధర్మవరం కోర్టులో సీనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయాధికారి వెంకటేశ్వర్లు, జూని యర్‌ సివిల్‌ కోర్టు న్యాయాధికారి పీడీఎం నందిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా 294 కేసులను పరిష్కరించినట్టు న్యాయా ధికారులు తెలిపారు. కేసుల్లో పరిష్కారమైన మొత్తం రూ.62,31,419 నగదు వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయాధికారి వెంకటహరీశ, బార్‌ అసోసియేషన ప్రెసిడెంట్‌ ఎంఏ ఖరీం, న్యాయవాదులు పాల్గొన్నారు.


- జిల్లాకేంద్రమైన పుట్టపర్తిలోని జూనియర్‌ సివిల్‌ కోర్టులో న్యాయాధికారి ముజీబ్‌ పసపల సయ్యద్‌ అధ్యక్షతన జాతీయ లోక్‌ అదాలతలో నిర్వహించారు. ఇందులో భాగంగా ఐపీసీ సీసీకేసులు 54, మద్యం సీసీ కేసులు 69, ఈపీ (సివిల్‌) కేసులు, చెక్‌బౌన్స కేసులు మూడు, మెయింటెనెన్స కేసులు రెండు, బ్యాంకు పిల్‌ కేసులు రెండు, ఎస్‌టీసీ పెట్ట్టి కేసులు 38 కేసులతో కలుపుకుని 168 కేసులను రాజీ మార్గంలో పరిష్కరించినట్లు న్యాయాధికారి తెలిపారు. ఈ కార్యక్రమం లో బార్‌ అసోసియేషన అధ్యక్షుడు కత్తి గంగిరెడ్డి, న్యాయవాదులు రాజేంద్రప్రసాద్‌రెడ్డి, నిడిమామిడి శ్రీనివాసులు, లెక్కల యధుభూషణ్‌, కుంచెపు శ్రీనివాసులు, మౌనిక, నాగేంద్ర, కిరణ్‌, క్రిమినల్‌క్లర్క్‌ మంజు నాథ్‌, సివిల్‌క్లర్క్‌ జ్యోతిబాయి, ఎంఎల్‌ఏసీ లక్ష్మానాయక్‌, వివిధశాఖల బ్యాంకు మేనేజర్లు, కోర్టు కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.


- కదిరి కోర్టు ఆవరణలో మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన, సీనియర్‌ సివిల్‌ కోర్టు న్యాఽయాధికారి ఎస్‌ జయలక్ష్మి మరో న్యా యాధికారి పీ లోకనాథంతో కలిసి శనివారం జాతీయ లోక్‌ ఆదాలతను నిర్వహించారు. ప్రజా న్యాయస్థానాల ద్వారా ప్రజలపై ఎలాంటి ఒత్తిడి ఉండదని, ఇరు వర్గాల ఆమోదంతోనే కేసులు పరిష్కరిస్తామని న్యాయాధికారి జయలక్ష్మి పేర్కొన్నారు. న్యాయాధికారులు జయలక్ష్మి, లోకనాథం రెండు బెంచులుగా విడిపోయి ఇద్దరేసి న్యాయవాదుల సహాయంతో కేసులను పరిష్కరించారు. రెండు బెంచీల ద్వారా నుంచి సివిల్‌, క్రిమినల్‌ తదితర కేసులను 1065 పరిష్కరించినట్లు న్యాయాధికారులు తెలిపారు. ఈ సదస్సులో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కే చౌడప్ప, ఏజీపీ పీవీ శివప్రసాద్‌, న్యాయవాదులు వాసుదేవ రెడ్డి, సిరాజుద్దీన, లోకేశ్వర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Dec 13 , 2025 | 11:32 PM