LOK ADALAT: రాజీతో జీవితం సుఖమయం
ABN , Publish Date - Sep 14 , 2025 | 12:56 AM
రాజీ మార్గం ద్వారానే జీవి తం సుఖమయం అవుతుందని సీనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి వెం కటేశ్వర్లు, జూనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి బొజప్ప పేర్కొన్నా రు. స్థానిక కోర్టులో శనివారం జాతీయ లోక్‌అదాలత కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా న్యాయాధికారులు మాట్లాడుతూ... జాతీయ లోక్ అదాలతలో కక్షిదారులు రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకో వచ్చని సూచించారు.
లోక్ అదాలతలో న్యాయాధికారుల సూచన
ధర్మవరం, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): రాజీ మార్గం ద్వారానే జీవి తం సుఖమయం అవుతుందని సీనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి వెం కటేశ్వర్లు, జూనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి బొజప్ప పేర్కొన్నా రు. స్థానిక కోర్టులో శనివారం జాతీయ లోక్‌అదాలత కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా న్యాయాధికారులు మాట్లాడుతూ... జాతీయ లోక్ అదాలతలో కక్షిదారులు రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకో వచ్చని సూచించారు. ఈ లోక్‌అదాలతలో 28 కేసులు పరిష్కారమయ్యా యని తెలిపారు. ఇందులో ఫ్రీలిటికేషన కేసులు 8(రూ.5.57లక్షలు), సివిల్‌కేసులు 3(రూ.50వేలు), చెక్‌బౌన్స కేసులు 4(రూ.17.50లక్షలు), ఎ క్సైజ్ కేసులు 2(రూ.16500), ఇతర కేసులు 11 మొత్తం 28 కేసులు పరిష్కరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
కదిరి లీగల్: ప్రజల మధ్య సమన్వయం ఏర్పరచి ప్రజా సంక్షేమాన్ని కాంక్షించేదే ప్రజా న్యాయస్థానమని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన, సీనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి జయలక్ష్మి పేర్కొన్నారు. కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్‌ఆదాలతను ప్రారంభించి మాట్లాడారు. మరో న్యా యాధికారి పీ లోకనాథం, న్యాయవాదుల సంఘం అఽధ్యక్షుడు కే చౌడప్ప, వివిధ భ్యాంకుల అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. న్యా యాధికారి జయలక్ష్మి నేతృత్వంలో ఒక బెంచ... న్యా యాధికారి జ్ఞానవ ర్థన రెడ్డి, న్యాయాధికారి లోకనాథం మరో బెంచ ద్వారా న్యాయ సహాయ కులు లోకేశ్వర్ రెడ్డి, రఘు పాల్గొని కేసులను పరిష్కరించారు. మొత్త 685 కేసులను పరిష్కరించినట్లు ప్రజా న్యాయస్థాన కార్యాలయం వెల్లడించింది.
ముదిగుబ్బ: మండలకేంద్రంలోని అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషనలో పెండింగ్‌లో ఉన్న 11 కేసులను లోక్ అదాలతలో పరిష్కరించినట్లు అప్ గ్రేడ్ పోలీస్టేషన సీఐ శివరాముడు పేర్కొన్నారు. సీఐ శనివారం విలేక రులతో మాట్లాడుతూ... ఎన్నో సంవత్సరాల నుంచి పలు కేసులు పరి ష్కారం కాని ఆ సమస్యలు కదిరి లోక్ అదాలతలో పరిష్కారం అయినట్లు ఆయన తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....